Thiruvananthapuram: మ్యాన్ హోల్స్ లో ఎక్క‌డైన స‌మ‌స్య‌లు వ‌స్తే అందులోకి మ‌నుషులు దిగి స‌రిచేయాల్సిందే. ఇలాంటి  మాన్యువల్ స్కావెంజింగ్ ను భార‌త్ లో నిషేధించ‌బ‌డింది. కానీ ఉపాధి కోసం ఇప్ప‌టికీ ఇది కొన‌సాగుతోంది. అయితే, కేరళలో మ్యాన్ హోల్స్ లోకి మనుషులు దిగనవసరం లేకుండా చ‌ర్య‌లు తీసుకుంది. మ్యాన్‌హోల్ క్లీనింగ్‌ను పూర్తిగా రోబోటైజ్ చేసిన మొదటి భారతీయ రాష్ట్రంగా కేరళ మ‌రో ఘ‌న‌త‌ను సాధించింది. 

Kerala - fully robotize manhole cleaning: మ్యాన్ హోల్స్ స‌మ‌స్య‌ల‌కు అందులోకి మనుషులు దిగనవసరం లేకుండా స‌రిచేసేందుకు కేర‌ళ మెరుగైన చర్యలు తీసుకుంది. మ్యాన్‌హోల్ క్లీనింగ్‌ను పూర్తిగా రోబోటైజ్ చేసిన మొదటి భారతీయ రాష్ట్రంగా కేరళ ఘ‌న‌త‌ను సాధించింది.

వివ‌రాల్లోకెళ్తే.. మ్యాన్ హోల్స్ లో ఎక్క‌డైన స‌మ‌స్య‌లు వ‌స్తే అందులోకి మ‌నుషులు దిగి స‌రిచేయాల్సిందే. ఇలాంటి మాన్యువల్ స్కావెంజింగ్ ను భార‌త్ లో నిషేధించ‌బ‌డింది. కానీ ఉపాధి కోసం ఇప్ప‌టికీ ఇది కొన‌సాగుతోంది. మాన్యువల్ స్కావెంజింగ్ అంటే మురుగు కాలువలు లేదా సెప్టిక్ ట్యాంకుల నుండి మానవ విసర్జనను చేతితో తొలగించడం. మ‌న దేశంలో దీనిని 1993లోనే నిషేధించారు. ఇందులో భాగ‌మైన పారిశుధ్య కార్మికులకు పున‌రావాసం, ఇత‌ర రంగాల్లో ఉపాధి అవ‌కాశాల‌ను క‌ల్పించాల‌ని చ‌ట్టం పేర్కొంటోంది. కానీ ఇప్ప‌టికీ మాన్యువల్ స్కావెంజింగ్ కొన‌సాగుతోంది. ప్ర‌భుత్వాలు ఈ విష‌యంలో చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నాయ‌ని అనేక రిపోర్టులు పేర్కొంటున్నాయి. కానీ, కేర‌ళ మాత్రం ఈ విష‌యంలో మ‌రో ముంద‌డుగేసింది.

ఇక్క‌డి యువ ఇంజనీర్స్ సహకారంతో రోబోటిక్ టెక్నాలజీ ద్వారా అక్కడ 1993 చట్టాన్ని గౌరవించి, మాన్యువల్ స్కావెంజింగ్ ను అరిక‌ట్టే చ‌ర్య‌లు తీసుకుంది. మ్యాన్ హోల్స్ క్లీనింగ్ చాలా సులభతరంగా చేసేందుకు రోబోటిక్ టెక్నాలజీ తీసుకువ‌చ్చింది. 

మ్యాన్‌హోల్‌ క్లీనింగ్‌ను పూర్తిగా రోబోటైజ్‌ చేసిన దేశంలోనే తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది. శుక్రవారం గురువాయూర్‌లో బాండికూట్ అనే రోబోటిక్ స్కావెంజర్‌ను జలవనరుల శాఖ మంత్రి రోషి అగస్టిన్ ప్రారంభించారు. బాండికూట్‌ను టెక్నోపార్క్ ఆధారిత స్టార్టప్, జెన్‌రోబోటిక్స్ అభివృద్ధి చేసింది. రోబోటిక్ టెక్నాలజీని రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేస్తామని మంత్రి అగస్టీన్ తెలిపారు. "కేరళలోని అన్ని కమీషన్డ్ మురుగునీరు-డ్రైనేజీలను శుభ్రం చేయడానికి బాండికూట్ సేవలను ఉపయోగించుకుంటాము" అని మంత్రి చెప్పారు.

కేరళ స్టార్టప్ మిషన్ (KSUM) నిర్వహించిన హడిల్ గ్లోబల్ 2022 కాన్‌క్లేవ్‌లో జెన్‌రోబోటిక్స్ ఇటీవల 'కేరళ ప్రైడ్' అవార్డును గెలుచుకుంది. బాండికూట్‌లో ప్రధాన భాగం అయిన రోబోటిక్ ట్రాన్ యూనిట్, మ్యాన్‌హోల్‌లోకి ప్రవేశించి, మనిషి అవయవాలను పోలి ఉండే రోబోటిక్ చేతులను ఉపయోగించి మురుగునీటిని తొలగిస్తుంది. బాండికూట్‌లో వాటర్‌ప్రూఫ్, హెచ్‌డి విజన్ కెమెరాలు, మ్యాన్‌హోల్స్ లోపల హానికరమైన వాయువులను గుర్తించగల సెన్సార్లు ఉన్నాయని జెన్‌రోబోటిక్స్ తెలిపింది.

భారతదేశంలోని 17 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రస్తుతం బాండికూట్ రోబోట్‌లు కొన్ని పట్టణాల్లో మోహరింపబడుతున్నాయి. 2018లో, KWA తిరువనంతపురంలోని మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేయడానికి బాండికూట్‌ను ఉపయోగించడం ప్రారంభించింది. తర్వాత ఎర్నాకులంలో కూడా ప్రవేశపెట్టినట్లు ఒక పత్రికా ప్రకటనలో ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి.