శబరిమల అయ్యప్ప స్వామిని 51మంది 50ఏళ్లలోపు మహిళలు దర్శించుకున్నారంటూ కేరళ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదన తప్పు అని తేలింది. కేవలం 17మంది మాత్రమే స్వామి వారిని దర్శించుకున్నారని తాజాగా తెలిసింది.

ఈ ఏడాది జనవరిలో ఇద్దరు మహిళలు తొలిసారిగా 50ఏళ్లలోపు మహిళలు అయ్యప్ప స్వామిని దర్శించుకున్న సంగతి తెలిసిందే.. దీంతో.. తీవ్ర వివాదం చెలరేగింది. ఈ ఇద్దరి తర్వాత మరికొంత మంది కూడా స్వామివారిని దర్శించుకునేందుకు ప్రయత్నించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఇప్పటి వరకు 51మంది మహిళలు ఆలయంలోకి ప్రవేశించారని చెప్పారు.

ఆ 51మంది జాబితాను పరిశీలించగా.. అందులో కొన్ని పురుషుల పేర్లు.. కొందరు 51ఏళ్లకు పైబడిన వారుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో స్వామి వారిని దర్శించుకున్న 50ఏళ్లలోపు మహిళల సంఖ్య 17గా తేలిందని అధికారులు తెలిపారు.  51మందిలో నలుగురు పురుషులు, 30 మంది 50ఏళ్లు పైబడిన మహిళలు ఉన్నారని అధికారులు చెప్పారు.