భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ (Arif Mohammad Khan ) గుర్తుచేశారు. సోమవారం Asianet Newsకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. హిజాబ్‌పై కొనసాగుతున్న వివాదం మొదలుకుని యూనిఫామ్ సివిల్ కోడ్‌పై కొత్త చర్చపై వ్యక్తమవుతున్న ఆందోళనల వరకు చాలా విషయాలపై ఆయన మాట్లాడారు.
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ (Arif Mohammad Khan ) గుర్తుచేశారు. దేశంలో ప్రతి ఒక్కరి స్వేచ్చ ఉందన్నారు. ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్చ ఉందని చెప్పారు. సోమవారం Asianet Newsకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. హిజాబ్‌పై కొనసాగుతున్న వివాదం మొదలుకుని యూనిఫామ్ సివిల్ కోడ్‌పై కొత్త చర్చపై వ్యక్తమవుతున్న ఆందోళనల వరకు చాలా విషయాలపై ఆయన మాట్లాడారు. పవిత్ర ఖురాన్‌లో మహిళల దుస్తుల విషయంలో 'హిజాబ్' అనే పదాన్ని ఉపయోగించలేదని అన్నారు. ఏషియా నెట్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సింధు సూర్యకుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేరళ గవర్నర్ చెప్పిన విషయాలు..
‘Hijab అనే పదాన్ని ఖురాన్‌లోని ఏడు శ్లోకాలలో లేదా ఏడు సందర్భాలలో ఉపయోగించారు. బురఖా కూడా ఒక రకమైన డ్రెస్. ముస్లిం చట్టం ఒక నిర్దిష్ట ఆకృతిని తీసుకోవడం ప్రారంభించింది.. వారు మహిళలతో ముడిపడి ఉన్న అన్ని రకాల దుస్తులకు హిజాబ్‌ను ఉపయోగించారు. నిజమే ఖురాన్ స్త్రీల దుస్తుల విషయంలో హిజాబ్‌ను ఉపయోగించలేదు. అయితే ఖురాన్ లో ‘ఖిమర్’ (తల కండువా) అనే పదం ప్రస్తావన ఉంది. ఒక వేళ మీరు ‘లిసాన్-ఉల్-అరబ్’ (అరబిక్ నిఘంటువు) చదివి ఉంటే అందులో ‘ఖిమర్’ ను స్కార్ఫ్‌గా, మహిళలు తమ వెంట తీసుకెళ్లే గుడ్డగా నిర్వచించారు’ అని కేరళ గవర్నర్ చెప్పారు.
ఖురాన్‌లో పేర్కొన్న హిజాబ్ సందర్భాన్ని మరింతగా గవర్నర్ వివరిస్తూ.. ‘ఆ కాలంలో దాదాపు ప్రతీ సమాజం రెండు విభాగాలుగా విభజించబడి ఉండేది. ఇందులో ఒక విభాగంలో స్వేచ్ఛా పురుషులు, స్వేచ్ఛా మహిళలు ఉంటే, మరో విభాగంలో బానిస పురుషులు, బానిస మహిళలు ఉండేవారు. అయితే ఆ సమయంలో దాదాపు చాలా అర్థిక వ్యవస్థలు బానిస ఆధారిత ఆర్థిక వ్యవస్థలుగా ఉండేవి 'ఖిమర్ అనేది 'జిల్‌బాబ్' (పొడవైన వస్త్రం)పైకి లాగవలసి ఉంటుంది.. దాని అర్థం ఎదను కప్పుకోవడానికి.
"
కానీ నేడు ప్రపంచ వ్యాప్తంగా బానిసత్వం లేదు. ప్రతీ ఒక్కరికీ మానవ హక్కులు ఉంటాయని ఐక్యరాజ్యసమితి ప్రకటన చేసింది. మనకు మన ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ప్రస్తుతం స్త్రీ అయినా, పురుషుడైనా అందరూ స్వేచ్ఛగా ఉన్నారు. కాబట్టి హిజాబ్ వేసుకునే అవసరం కూడా లేదు’ అని అన్నారు.
అమ్మాయిల్లోని చైతన్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు..
కాలేజీలు, యూనివర్సిటీలకు వెళ్లే అమ్మాయిలతో మతానికి ముప్పు ఉన్నదనే ఆలోచనల్లోనే హిజాబ్ వివాదం మూలాలు ఉన్నాయని కేరళ గవర్నర్ చెప్పారు. హిజాబ్ ధరించడం మూలంగా రేగిన వివాదం అనవసరం అయినది అని ఆయన పేర్కొన్నారు. దీనికి వెనుక ఒక కుట్ర ఉన్నదని వివరించారు. మన దేశంలోని నవతరం అమ్మాయిలు విద్యలో రాణిస్తున్నారని చెప్పారు. యూనివర్సిటీ, కాలేజీల్లో వారు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో ముస్లిం మతానికి చెందిన అమ్మాయిలు కూడా ఉన్నారని వివరించారు. ఇక్కడే కుట్ర మూలాలు వేళ్లూనుకుని ఉన్నాయని తెలిపారు.
ముస్లిం మతంలో ఓ చిన్న సమూహం త్రిపుల్ తలాఖ్ కొనసాగాలని భావించేది ఉన్నదని కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ తెలిపారు. ఈ గుంపులోని వారే ముస్లిం అమ్మాయిలు కాలేజీల్లో, యూనివర్సిటీల్లో రాణిస్తున్నారని తెలియగానే కొంత అసహనానికి గురయ్యారని వివరించారు. ఆ అమ్మాయిల్లోని చైతన్యాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని, అది ఒక రకంగా మతానికి ముప్పుగానే ఆ కొందరు భావిస్తున్నారని తెలిపారు.
అదిగో.. ఆ సెక్షన్ వాళ్లే.. ఈ హిజాబ్ వివాదం ద్వారా ముస్లిం అమ్మాయిలను కాలేజీలు, యూనివర్సిటీలకు దూరం చేయాలనే కుట్ర పన్నారని కేరళ గవర్నర్ ఆరోపించారు. ఒక వేళ వారు హిజాబ్ ధరించి కూడా తమ చదువును కొనసాగించినా.. వారి కెరీర్ ఎంతో ఉన్నతంగా ఎదగకుండా జాగ్రత్త పడేవారని పేర్కొన్నారు. వారిని ఇంటికే పరిమితం చేయాలనే కుట్రనే ఇది అని వివరించారు.
యూనిఫామ్ సివిల్ కోడ్ ఎవరి హక్కులకు భంగం కలింగించదు..
యూనిఫామ్ సివిల్ కోడ్ ఎవరి హక్కులకు, గుర్తింపులకు భంగం కలిగించదని కేరళ గవర్నర్ ఏషియానెట్ న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అన్నారు. ఒకే సివిల్ కోడ్ ద్వారా వివాహ చట్టాలను ఏకీకృతం చేయడంపై వ్యాఖ్యానించిన ఆయన..ముస్లిం వివాహాల్లో ఎంత మంది వధువుకు మెహర్ ఇస్తారని ప్రశ్నించారు. హిజాబ్‌పై నిషేధానికి తాను పూర్తిగా మద్దతిస్తున్నానని చెప్పాయి. అయితే రాజకీయ చర్చలకు తావివ్వబోనని గవర్నర్ స్పష్టం చేశారు.హిజాబ్ నిషేధానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో కుట్ర ఉందన్నారు. హిజాబ్ ఇస్లాంలో అంతర్లీనంగా ఉందని చెప్పినవారే కుట్రదారులని గవర్నర్ చెప్పుకొచ్చారు.
యూనిఫామ్ సివిల్ కోడ్‌కి వ్యతిరేకంగా ఉన్నవారిని ప్రశ్నిస్తూ.. ‘నేడు.. యూనిఫాం సివిల్ కోడ్ లేదు! ఇప్పుడు.. ఎంత మంది ముస్లిం భర్తలు తమ భార్యలకు ‘మెహర్’ చెల్లిస్తున్నారు? ఒక సర్వే నిర్వహించమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ముస్లింలలో చాలా వరకు వివాహ వివాదాలు విడాకుల తర్వాత మాత్రమే జరుగుతాయి. మెహర్ ప్రశ్న వివాదాస్పదమైంది.. విషయం కోర్టుకు వెళుతుంది. ఎందుకంటే మతం యొక్క నిజమైన స్ఫూర్తితో వెళితే.. పెళ్లికి ముందు మెహర్ చెల్లించాలి. ఇది ప్రజలకు తెలియదని కాదు’ అని గవర్నర్ పేర్కొన్నారు.
యూనిఫామ్ సివిల్ కోడ్ అమలులో ఉన్న దేశాల్లో పెద్ద సంఖ్యలో ముస్లింలు నివసిస్తున్నారని గవర్నర్ చెప్పారు. అక్కడ ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది లేదని.. అటువంటి విధానాన్ని భారతదేశంలో అమలు చేస్తే ఏమి జరుగుతుందని ప్రశ్నించారు.
‘స్త్రీ ధరించాల్సిన శాలువా గురించి ఖురాన్ చెబుతోంది. ప్రతి ఒక్కరికి (పురుషులకు, మహిళలకు) తాము ఏం ధరించాలో, ధరించకూడదనే నిర్ణయించుకునే అధికారం ఉందని నేను నమ్ముతున్నాను. వారు (ముస్లిం లీగ్) నన్ను వేధిస్తున్నారు. 1986లో నేను రాజీనామా చేసినప్పుడు బీజేపీకి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారు. 25 ఏళ్లకే మంత్రి అయ్యాను. తాను నరేంద్ర మోదీని మూడు సార్లు మాత్రమే కలిశానని చెప్పారు.అది ఖురాన్‌కు విరుద్ధమని నేను అంటున్నాను. రాజకీయ చర్చల్లో తలదూర్చడం నాకు ఇష్టం లేదు. ఖురాన్‌లో ఉన్నది నేను చెబుతున్నాను. నాకు బోధించినందుకు వారికి ధన్యవాదాలు’ అని గవర్నర్ పేర్కొన్నారు.
కుంకుమ పువ్వు మతపరమైన భావాలను కలిగి ఉండదని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ వివరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాషాయీకరణ చేసిందన్న ఆందోళనలను ఆయన కొట్టిపారేశారు. కేరళ గవర్నర్ ఖురాన్‌లోని ఒక ఎపిసోడ్‌ను ఉటంకిస్తూ.. దానినే బైబిల్‌లో కూడా ప్రస్తావించారని చెప్పారు. ‘మీకు, కుంకుమపువ్వు మతపరమైన భావాలను కలిగి ఉంది.. నాకు కుంకుమపువ్వు అనేది నా కళ్ళకు ఆహ్లాదకరమైన రంగు. భారతీయుడిగా నాకు కుంకుమపువ్వు త్యజించే రంగు’ అని ఆయన చెప్పారు.
త్రివర్ణ పతాకం గురించి..
జాతీయ పతాకం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ గవర్నర్.. ‘మనం విచిత్రమైన వ్యక్తులం.. మనం ఈ త్రివర్ణాన్ని కలిగి ఉన్నాము. కుంకుమ భాగం హిందూ, తెలుపు భాగం ఇతరులు, ఆకుపచ్చ భాగం ముస్లింలు అని ఏమి తెలియకుండా అంటుంటారు. భారతీయ రంగులో కుంకుమపువ్వు అంటే త్యజించడం.. త్యాగం యొక్క ఆత్మ అని అర్థం. అంటే మీ కోసం కాకుండా ఇతరుల కోసం జీవించడం. తెలుపు రంగు శాంతిని సూచిస్తుంది. ఆకుపచ్చ ముస్లింలను సూచించదు.. ఆకుపచ్చ శ్రేయస్సును సూచిస్తుంది’ అని చెప్పారు.
కేరళపై యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో చాలా విషయాలు మాట్లాడతారని అన్నారు. ప్రశాంతమైన జీవితాన్ని గడపాలంటే చాలా ఓపికగా, సహిస్తూ, పట్టించుకోకుండా ఉండాలని చెప్పారు.
ముస్లిం మహిళలను ఇళ్లకే పరిమితం చేసేందుకు, వారి అభివృద్ధిని అడ్డుకునేందుకు హిజాబ్ వివాదాన్ని వాడుకుంటున్న వారిపై గవర్నర్ మండిపడ్డారు. సమాజం, దేశ పరిస్థితి మెరుగుపడాలంటే మంచి చదువు ఒక్కటే మార్గమని అన్నారు. కొందరు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాలకు యువ తరం దూరంగా ఉంటూ చదువులో రాణించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. అలాగే, ఈ అనవసర వివాదానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.
