Asianet News TeluguAsianet News Telugu

యూట్యూబ్ వీడియో చూస్తూ బిడ్డకు జన్మనిచ్చిన మైనర్ బాలిక.. పెళ్లికి ముందే శృంగారం..

17 ఏళ్ల బాలిక.. పక్కింటి వ్యక్తితో ప్రేమలో పడింది. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడంతో.. బాలిక గర్భం దాల్చింది. అయితే ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు గుర్తించలేకపోయారు. అయితే ఆ బాలిక.. యూట్యూబ్ వీడియోలు చూసి ఎవరి సాయం లేకుండానే తన బెడ్ ‌రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. 

Kerala girl gives birth with help of YouTube videos
Author
Malappuram, First Published Oct 28, 2021, 3:46 PM IST

17 ఏళ్ల బాలిక.. పక్కింటి వ్యక్తితో ప్రేమలో పడింది. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడంతో.. బాలిక గర్భం దాల్చింది. అయితే ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు గుర్తించలేకపోయారు. అయితే ఆ బాలిక.. యూట్యూబ్ వీడియోలు (YouTube videos) చూసి ఎవరి సాయం లేకుండానే తన బెడ్ ‌రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. శిశువు ఏడుపు విన్న బాలిక కుటుంబ సభ్యులు బాలిక గదిలోకి వెళ్లి చూడగా అసలు విషయం బయటపడింది. కేరళలోని మలప్పురం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక, బాలికను గర్బవతి చేసినట్టుగా ఆరోపణలపై పక్కింట్లో ఉంటునన 21 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘బాలిక పక్కింటి వ్యక్తితో రిలేషన్‌లో ఉంది. ఈ విషయం కటుంబానికి కూడా తెలుసు. అయితే బాలిక గర్భం దాల్చిన సంగతి వారిద్దరు ఇరు కుటుంబాల వద్ద దాచారు’అని కొట్టాక్కల్ ఎస్‌హెచ్‌వో ఎమ్‌కే షాజీ తెలిపారు. 

Also read: మెట్రోపై సజ్జనార్ వార్..? వామ్మో మాములుగా లేదుగా.. ఈ వీడియో చూడండి..

వివరాలు.. బాలిక తల్లిదండ్రులతో కలిసిMalappuram districtలోని కొట్టకల్‌ ఠాణా పరిధిలో నివాసం ఉంటుంది. తండ్రి సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. ఆమె తల్లి ఇంటివద్దే ఉంటుంది. అయితే ఆమె కళ్లు సరిగా కనిపించవు. బాలిక అక్కకు కొంతకాలం కిందట పెళ్లి జరిగింది. అయితే బాలిక సోదరుడు ఎప్పుడో ఒకసారి ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. అయితే ఆమె పక్కింట్లో ఉంటున్న వ్యక్తిని ప్రేమించింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలిసింది. అయితే బాలికకు 18 ఏళ్లు నిండాక పెళ్లి చేయాలనే నిర్ణయానికి వచ్చారు. 

Also Read: అందమైన కశ్మీర్.. భారతదేశ కిరీటంలో ఆభరణమన్న అమిత్ షా.. వైరల్ అవుతున్న ఫొటోలు..

ఈ క్రమంలోనే బాలిక ఆ యువకుడితో శృంగారంలో పాల్గొంది. గ‌ర్భం రావ‌డంతో ఇంట్లో త‌ల్లికి తెలియ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డింది.  దీంతో బాలిక ఇంట్లోని తన గదికే పరిమితమైంది. తనకు ఆన్‌లైన్ క్లాసులు ఉన్నాయని చెప్పి ఎక్కువ సమయంలో గదిలోనే గడిపేది. తీరా డెలివ‌రీ స‌మ‌యం రావ‌డంతో యూట్యూబ్ వీడియోలు చూసి స్వ‌యంగా త‌న‌కు తానే డెలివ‌రీ చేసుకున్న‌ది. అయితే శిశువు ఏడుపు వినిపించడంతో అసలు విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు బాలికను, ఆమెకు జన్మించిన శిశువును ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం బాలిక, ఆమె శిశువు ఇద్దరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు.

Also read: తెలంగాణ కాంగ్రెస్ యువనేతకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు.. రేవంత్‌ రెడ్డికి చెక్?

బాలిక మైనర్ కావడంతో ఆస్పత్రి సిబ్బంది మలప్పురం జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం అందించారు. వారు దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాలిక స్టేట్‌మెంట్ తీసుకన్న పోలీసులు.. ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. అతనిపై పోక్సోతో పాటుగా ఐపీసీ 376 కింద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Follow Us:
Download App:
  • android
  • ios