Asianet News TeluguAsianet News Telugu

ఛీ.. దీన్ని కూడా వాడుకుంటున్నారా..?

ఒకవైపు జనాలు ప్రాణాలతో కొట్టుకుంటున్నారే అనే ఆలోచన కూడా లేకుండా వారి స్వార్థానికి మోసాలకు పాల్పడుతున్నారు. కేరళ వరద విపత్తును కూడా క్యాష్‌ చేసుకోవడానికి నకిలీ కేటుగాళ్లు సిద్ధమైపోయారు. 

kerala floods Probe launched into fake account for flood relief
Author
Hyderabad, First Published Aug 21, 2018, 3:53 PM IST

కేరళను వరదలు ముంచెత్తాయి. అక్కడి ప్రజలు సర్వం కోల్పోయి.. సాయం చేసేవారి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కొందరికైతే తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా దొరకడం లేదు. వారిని ఆదుకునేందుకు చాలా మంది మనసున్న మనుషులు ముందుకు వస్తున్నారు. తమకు తోచిన సహాయం చేస్తున్నారు.

అయితే.. కొందరు కేటుగాళ్లు.. దీనిని కూడా అవకాశంగా మలుచుకుంటున్నారు. ఒకవైపు జనాలు ప్రాణాలతో కొట్టుకుంటున్నారే అనే ఆలోచన కూడా లేకుండా వారి స్వార్థానికి మోసాలకు పాల్పడుతున్నారు. కేరళ వరద విపత్తును కూడా క్యాష్‌ చేసుకోవడానికి నకిలీ కేటుగాళ్లు సిద్ధమైపోయారు. వరద బాధితుల కోసం సహాయం చేయాల్సిన వారు ఈ ఎకౌంట్ లో డబ్బులు వేయండి అంటూ ప్రచారం చేశారు. అది నమ్మి అందులో ప్రజలు డబ్బులు వేస్తే.. వాటిని కాజేయాలని వారి కుట్ర.
అయితే  ఈ ప్రయత్నాలకు ఎట్టకేలకు  ఫుల్‌స్టాప్‌ పెట్టారు అధికారులు.  కేరళ సీఎం డిస్ట్రబ్ రిలీఫ్ ఫండ్ పేరుతో నకిలీ బ్యాంకు ఖాతాను ఛేదించామని ఎస్‌బీఐ ప్రతినిధి వెల్లడించారు.

20025290179, త్రివేండ్రం పేరుతో సోషల్‌ మీడియాలో విపరీతంగా షేర్‌ అయింది.  అయితే తమిళనాడులోని తిరుచిరాపల్లిలో బ్యాంకు బ్రాంచ్‌గా ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ద్వారా గుర్తించారు. అయితే ఈ ఖాతాలో రెండు, మూడువేలు మాత్రమే ఉన్నాయని  దీన్ని  ఇప్పటికే బ్లాక్‌ చేశామని బ్యాంకు  ప్రతినిధి ఒకరు తెలిపారు.   ఇంకా ఎలాంటి లావాదేవీలు సాధ్యంకాదని వివరించారు. దీనిపై విచారణకు ఆదేశించామన్నారు. అంతకుమించి వివరాలు వెల్లడించారు.

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నిజమైన బ్యాంకు ఖాతా 67319948232 ముఖ్యమంత్రి  అధికారిక ట్విట్టర్ ఖాతా,  ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు. మరోవైపు  మోసపూరిత సందేశాలు / పోస్టర్లు సోషల్‌ మీడియాలో​ దర్శనమివ్వడంతో నకిలీ ఖాతాలు, సందేశాలపట్ల అప్రమత్తంగా ఉండాలని  కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రజలకు సూచించింది. అలాగే  సైబర్ నేరస్థులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు కఠిన ఆదేశాలు జారీ చేసింది.  

Follow Us:
Download App:
  • android
  • ios