Asianet News TeluguAsianet News Telugu

కేరళ అతలాకుతలం.. 29మంది మృతులు, 54వేలమంది నిరాశ్రయులు

54వేల మంది నిరాశ్రయులయ్యారు. కాగా..ఈ వర్షాల కారణంగా వచ్చిన వరదల నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 

Kerala floods: 29 dead, 54,000 homesless; CM conducts aerial survey
Author
Hyderabad, First Published Aug 11, 2018, 11:38 AM IST

భారీ వర్షాలు కేరళను అతలాకుతలం చేసేశాయి. ఇప్పటివకు ఈ వర్షాల కారణంగా 29మంది ప్రాణాలు కోల్పోయారు. 54వేల మంది నిరాశ్రయులయ్యారు. కాగా..ఈ వర్షాల కారణంగా వచ్చిన వరదల నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటి వరకు 15,600మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికోసం ప్రత్యేకంగా 500ల ప్రత్యేక రక్షణ శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు.

వాగులు, వంకలు ఏకం కావడంతో నదులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలప్పుజ, ఇడుక్కి, వయనాడ్, కొల్లాం, మళప్పురం జిల్లాల్లో వరదలు పోటెత్తుతుండటంతో.. ఊళ్లు సముద్రాలను తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లు, రైలు పట్టాల మీద అడుగుల మేర నీరు ప్రవహించడటంతో పాటు రహదారులు కొట్టుకుపోయాయి.

Kerala floods: 29 dead, 54,000 homesless; CM conducts aerial survey

ఆర్మీ, నేవీ అధికారులు రంగంలోకి దిగి.. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కేరళ పర్యాటక ప్రాంతం కాబట్టి.. అక్కడికి తరచూ పర్యాటకులు వస్తూ ఉంటారు. అలా వచ్చి ఈ వరదల్లో చిక్కుకుపోయిన 60మంది టూరిస్టులను అధికారులు రక్షించగలిగారు. అందులో 20మంది విదేశీయులు ఉన్నారు.

కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్..ముందపు ప్రాంతాలను ఎరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు.. వారికి అన్ని ఫుడ్, షెల్టర్ తదితర సదుపాయాలను కూడా అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios