Asianet News TeluguAsianet News Telugu

ఈ డాక్టర్ హ్యాండ్ రైటింగ్ కి నెటిజన్లు ఫిదా...!

కొందరు రాసేది అయితే..చచ్చినా అర్థం కాదు. అయితే... వీరందరికీ భిన్నంగా... చిన్న పిల్లలు చదివినా అర్థమయ్యేలా ఓ డాక్టర్ ప్రిస్కిప్షన్ రాశాడు. దీంతో... ఇప్పుడు ఆ ప్రిస్కిప్షన్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
 

Kerala Doctor's Super Neat Writing On Prescription Goes Viral
Author
First Published Sep 29, 2022, 9:39 AM IST

డాక్టర్ హ్యాండ్ రైటింగ్ విషయంలో ఇప్పటి వరకు మీరు చాలా జోక్స్ విని ఉంటారు. ఎందుకంటే.. వారు రాసేది.. మెడికల్ దుకాణం వారికి తప్పితే ఎవరికీ అర్థం కాదు. ఒక్క డాక్టర్ కాదు.. దాదాపు డాక్టర్లు అందరూ అలానే రాసేస్తారు. అదేంటో మరి.. మనం ఆ ప్రిస్కిప్షన్ చదవాలని ప్రయత్నించినా అర్థం కాదు. కొంతమంది డాక్టర్లు రాసేది కాస్తో కూస్తో అర్థమౌతుంది. కానీ... కొందరు రాసేది అయితే..చచ్చినా అర్థం కాదు. ఏదో పిచ్చి గీతలు గీసీనట్లే ఉంటుంది. అయితే... వీరందరికీ భిన్నంగా... చిన్న పిల్లలు చదివినా అర్థమయ్యేలా ఓ డాక్టర్ ప్రిస్కిప్షన్ రాశాడు. దీంతో... ఇప్పుడు ఆ ప్రిస్కిప్షన్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

 

కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో పీడియాట్రీషియన్ నితిన్ నారాయణ్( చిన్న పిల్లల డాక్టర్) పనిచేస్తున్నారు. ఆయన ఇతర డాక్టర్లలా కాకుండా.. రోగులకు అర్థమయ్యేలా ప్రిస్కిప్షన్ రాయడం విశేషం. అది కూడా అలా ఇలా కాదు... ఆయన చేతిరాత ముత్యల్లా ఉంది. చూడగానే ఎవరికైనా ముచ్చటేసేలా ఉంది. చదవడం వచ్చిన వారందరికీ... ఆయన ప్రిస్కిప్షన్ చూస్తే వెంటనే అర్థమయ్యేలా ఉంది. దీనిని ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. ఇంత అందమైన చేతిరాత ఉన్న డాక్టర్ ని ఇప్పటి వరకు చూడలేదంటూ.. ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios