తిరువనంతపురం: పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ మంగళవారం నాడు తీర్మానం చేసింది.  కేరళ సీఎం పినరయి విజయన్ పౌరసత్వ సవరణ బిల్లును వెనక్కు తీసుకోవాలని కోరుతూ కేరళ అసెంబ్లీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సీఎం విజయన్.

అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టే సమయంలో కేరళ సీఎం విజయన్‌ ప్రసంగించారు. కేరళ రాష్ట్రానికి సెక్యులరిజానికి చాలా చరిత్ర ఉందని విజయన్ చెప్పారు.

కేరళ రాష్ట్రంలో సెక్యులరిజానికి చాలా చరిత్ర ఉందని కేరళ సీఎం విజయన్ చెప్పారు. గ్రీకులు, రోమన్లు, అరబ్బులు ఎవరైనా తమ భూభాగంలోకి రావొచ్చని విజయన్ చెప్పారు.

కేరళ అసెంబ్లీ సంప్రదాయాలను కొనసాగిస్తుందని విజయన్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశాన్ని ఆర్ఎస్ఎస్ ఎజెండాతో కులాలు,మతాల మధ్య చిచ్చుపెట్టి విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా చెప్పారు. పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ  డిసెంబర్ 11వ తేదీన ఆమోదం తెలిపింది.

ఈ బిల్లు రాజ్యాంగవిరుద్దమైన బిల్లు అంటూ కేరళ సీఎం విజయన్ తేల్చి చెప్పారు.ఈ బిల్లు సెక్యులరిజానికి విరుద్దంగా ఉందని చెప్పారు.