Kerala blasts : కేరళలో పేలుళ్లు.. నాలుగుకు చేరిన మృతుల సంఖ్య
Kerala blasts: కేరళ పేలుళ్ల ఘటనలో మరణాల సంఖ్య నాలుగుకు చేరింది. ప్రమాదం జరిగిన రోజు ఇద్దరు, మరుసటి రోజు ఒకరు మరణించగా.. తాజాగా 61 ఏళ్ల మహిళ చనిపోయారు. పేలుడు సంభవించిన సమయంలో ఆమెకు 70 శాతం కాలిన గాయాలు అయ్యాయి. అప్పటి నుంచి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆమె.. పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు.
Kerala blasts : కేరళలో పేలుడు ఘటన ఒక్క సారిగా దేశంలో సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనలో అదే రోజు ఇద్దరు మరణించగా.. మరొసటి రోజు ఒకరు చనిపోయారు. తాజాగా 61 ఏళ్ల మహిళ మృతి చెందారు. దీంతో వారం క్రితం కొచ్చిలో జరిగిన క్రిస్టియన్ మత సమ్మేళనంలో జరిగిన పేలుళ్లలో మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరింది.
కీచక ప్రిన్సిపాల్.. 50 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు..
ఈ ప్రమాదంతలో తీవ్రంగా గాయపడిన కలమస్సేరికి చెందిన మోలీ జాయ్ అనే మహిళ సోమవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో మరణించారు. అక్టోబర్ 29న మతపరమైన సమావేశంలో జరిగిన పేలుడులో ఆమె 70 శాతానికి పైగా కాలిన గాయాలతో హాస్పిటల్ లో చేరారు. అప్పటి నుంచి ఆమె వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో నేటి తెల్లవారుజామున ఆమె కన్నుమూశారు. బాధితురాలికి తొలుత మరో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించి, అనంతరం ఎర్నాకుళం మెడికల్ సెంటర్ కు తరలించారు.
annaram barrage : ఖాళీ అవుతున్న అన్నారం బ్యారేజీ.. 10 రోజులుగా గేట్లు ఎత్తి నీటి విడుదల
యెహోవాసాక్షుల అనుచరులు ఏర్పాటు చేసిన మూడు రోజుల ప్రార్ధనా సమావేశ౦లో చివరి రోజైన అక్టోబర్ 29న ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగిన రోజు సభలో పాల్గొన్న ఇద్దరు మహిళలు మృతి చెందారు. 50 మందికి పైగా గాయపడ్డారు. కాగా.. ఎర్నాకుళం జిల్లా మలయత్తూర్ కు చెందిన లిబీనా అనే 12 ఏళ్ల బాలిక కూడా కలమస్సేరి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో అక్టోబర్ 30న మృతి చెందింది. కాగా.. ఈ పేలుడు సంభించిన కొన్ని గంటల తర్వాత, ఓ వ్యక్తి త్రిస్సూర్ జిల్లాలో పోలీసుల ముందు లొంగిపోయాడు. అనంతరం పోలీసులు అతని అరెస్టును నమోదు చేశారు.