కేజ్రీవాల్ నివాసం పునరుద్ధరణ వివాదం..విచారణ చేపట్టిన సీబీఐ..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం పునరుద్ధరణ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం బంగ్లా పునరుద్ధరణలో ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నాంటూ వచ్చిన ఆరోపణలపై సీబీఐ (CBI) ప్రాథమిక విచారణను ప్రారంభించింది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన అధికారిక నివాసం పునరుద్ధరణ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేజ్రీవాల్ అధికారిక నివాసం పునరుద్ధరణలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై సీబీఐ (CBI) ప్రాథమిక విచారణను ప్రారంభించింది. దర్యాప్తు సంస్థ బుధవారం కేసు నమోదు చేసింది.
మే 12న లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా బంగ్లా, దాని క్యాంపస్‌లో నిర్మించిన కార్యాలయాన్ని పునరుద్ధరించడానికి విజిలెన్స్ విభాగం ఒక నివేదికను సమర్పించింది. బంగ్లా కోసం 52.71 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన చెప్పారు. దీని తర్వాత జూన్ 18న విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ 7 మంది పీడబ్ల్యూడీ అధికారులకు షోకాజ్ నోటీసు జారీ చేయగా, 15 రోజుల్లోగా సమాధానం ఇవాలని కోరారు.
ఈ విషయంపై ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీల మధ్య మాటాల యుద్దం కొనసాగుతోంది. మా పార్టీని నాశనం చేసేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆప్ ఆరోపిస్తోంది. ఇప్పుడు వారు (బిజెపి) కేజ్రీవాల్‌కు పగ్గాలు వేయాలనుకుంటున్నారు, అందుకే వారు అన్ని ఏజెన్సీలను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు ఆప్ నేతలు. సీఎం కేజ్రీవాల్ కు 2 కోట్ల మంది ఢిల్లీవాసుల ఆశీస్సులు ఉన్నాయి. అతనిపై ఇప్పటి వరకు 50కి పైగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పుడు ఏమీ దొరకలేదు ఇప్పుడు కూడా దొరకదు. బీజేపీ ఎన్ని విమ ర్శ లు చేసినా.. సామాన్యుల సంక్షేమం కోసం కేజ్రీవాల్ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటారని తెలిపింది.
ఈ క్రమంలో ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ ఓ వీడియోను పంచుకున్నారు. కేజ్రీవాల్ పాత బంగ్లా పైకప్పు మూడుసార్లు కూలిపోయిందని చెప్పారు. అందువల్ల బంగళా పునర్నిర్మాణం అవసరమని తెలిపారు
ఏ బిల్డింగ్ ప్లాన్‌కు ఆమోదం తీసుకోలేదు
సీఎం కేజ్రీవాల్ బంగ్లా పాత నిర్మాణాన్ని సర్వే నివేదిక లేకుండానే కూల్చివేశారని నోటీసులో పేర్కొన్నారు. కొత్త భవన నిర్మాణానికి సంబంధించి ఏ బిల్డింగ్ ప్లాన్‌కు కూడా పీడబ్ల్యూడీ అనుమతి తీసుకోలేదు. హక్కులకు భంగం కలిగిస్తూ ముఖ్యమంత్రి ఇంటిని నిర్మించారు. మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు సూచించిన పారామితుల కంటే అతని ఇల్లు చాలా పెద్దది.
విజిలెన్స్ విభాగం నివేదిక ప్రకారం.. కేజ్రీవాల్ ఇంటికి రూ.33.49 కోట్లు ఖర్చు చేశారు. ఇక ఆయన కార్యాలయానికి రూ.19.22 కోట్లు ఖర్చు చేశారు. అతని పాత బంగ్లాను కూల్చివేసి కొత్త బంగ్లా నిర్మించారు. సెప్టెంబర్ 2020 నుంచి జూన్ 2022 మధ్య కేజ్రీవాల్ బంగ్లా కోసం డబ్బు ఖర్చు చేయబడింది
మీడియా నివేదికల ప్రకారం.. 2020లో, అప్పటి PWD మంత్రి కేజ్రీవాల్ బంగ్లా (6, ఫ్లాగ్ స్టాఫ్ రోడ్)లో మార్పులను ప్రతిపాదించారు. బంగ్లాలో 24 మంది కూర్చునే గది, రెండు సమావేశ గదులు, భోజనాల గది నిర్మించాలని ఆయన చెప్పారు. ఇందుకోసం బంగ్లా రెండో అంతస్తు నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది.
అయితే, ఢిల్లీ ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి) బంగ్లాను పడగొట్టి, అదే ప్రాంగణంలో కొత్త బంగ్లాను నిర్మించాలని పేర్కొంది. 1942-43 మధ్యకాలంలో ఈ బంగ్లాను నిర్మించినట్లు పీడబ్ల్యూడీ తెలిపింది. ఇది నిర్మించి 80 ఏళ్లు కావస్తున్నందున దాని పైన కొత్త అంతస్తు నిర్మించడం సరికాదన్నారు.