Kashmir Files: ద కశ్మీర్ ఫైల్స్ చిత్రం ద్వారా వచ్చిన డబ్బులను కశ్మీర్ పండిట్ల సంక్షేమం కోసం వినియోగించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రానికి సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ అంశాన్ని బీజేపీ రాజకీయం కోసం, ధనార్జన కోసమే వాడుకుంటోందని ఆయన విమర్శించారు.
Kashmir Files: కశ్మీరీ పండితుల వలస ఆధారంగా బాలీవుడ్ డైరక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించ చిత్రం 'కశ్మీర్ ఫైల్స్ . ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ఇప్పటివరకూ రూ. 200 కోట్లకు పైగా ఆర్జించింది. అయితే.. ఈ చిత్రానికి బీజేపీ సపోర్టు చేస్తూ.. ప్రమోట్ చేయడంతో రాజకీయ రంగు పూలుముకుంది. దీంతో విపక్షలు, బీజేపేతర పార్టీలు ఈ చిత్రాన్ని తిరస్కరిస్తున్నారు.
ప్రధానంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అడపదడప ఈ చిత్రంపై కామెంట్ చేస్తునే ఉన్నారు. గత రెండు రోజుల క్రితం ఈ చిత్రానికి ట్యాక్స్ ఫ్రీగా ప్రకటించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.ఇప్పటికే పలు రాష్ట్రాలు ట్యాక్స్ ఫ్రీ సినిమాగా ప్రకటిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ తనదైన శైలిలో స్పందించారు. బీజేపీ నేతలంతా ఆ సినిమా దర్శకుడైన వివేక్ అగ్నిహోత్రిని కలిసి.. ఎవరికి ఏలాంటి ఇబ్బంది లేకుండా .. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించాలని ఎద్దేవా చేశారు. అలా చేస్తే.. అందరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ఉచితంగానే కశ్మీర్ ఫైల్స్ సినిమాను చూస్తారని తెలిపారు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
తాజాగా ఈ చిత్రంపై కేజ్రీవాల్ మరోసారి స్పందించారు. 'కశ్మీర్ ఫైల్స్' సినిమా ద్వారా వచ్చే ఆదాయాన్ని కాశ్మీరీ పండిట్‌ల వాపసు కోసం ఉపయోగించాలని కేజ్రీవాల్ సూచించారు. మీడియాతో శనివారం జరిగిన ఒక సమావేశంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. కశ్మీర్ అంశాన్ని బీజేపీ రాజకీయం కోసం, ధనార్జన కోసమే వాడుకుంటోందని ఆయన విమర్శించారు. గత 25 ఏళ్లలో కాశ్మీరీ పండిట్ల వలస తర్వాత బీజేపీ 13 ఏళ్లు అధికారంలో ఉంది. వరుసగా గత ఎనిమిదేళ్ల నుంచి దేశాన్ని పాలిస్తోంది. అయినా, కశ్మీర్ పండిట్లు ఎవరూ తిరిగి కాశ్మీర్ వెళ్లలేకపోయారని విమర్శించారు
కశ్మీర్ పండిట్లపై జరిగిన దురాచారాల్ని బీజేపీ రాజకీయం కోసం ఉపయోగించుకుందని విమర్శించారు. బీజేపీ.. కశ్మీరీ వలసలను రాజకీయం చేస్తోందని, వారి బాధలను ఉపయోగించుకుని కోట్లకు కోట్లు దండుకుంటున్నదని ఢిల్లీ సీఎం ఆరోపించారు. కశ్మీరీ పండిట్ల దురాగతాలను బీజేపీ రాజకీయం చేసిందని ఆయన అన్నారు. ఇప్పుడు వారి విషాదం మీద సినిమాలు తీసి డబ్బులు సంపాదిస్తున్నారు. కశ్మీర్ ఫైల్స్ దాదాపు రూ. 200 కోట్లు సంపాదించింది. ఈ సినిమా ద్వారా వచ్చిన డబ్బులను కశ్మీర్ పండిట్ల సంక్షేమం కోసం వాడాలని, వాళ్లు కాశ్మీర్ తిరిగొచ్చి స్థిరపడేందుకు ఈ డబ్బులు ఉపయోగించాలని కేజ్రీవాల్ సూచించారు.
