Asianet News TeluguAsianet News Telugu

చైనా వస్తువులను బహిష్కరించండి: కేజ్రీవాల్

చైనా వస్తువులను బహిష్కరించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. 2020-21లో చైనా నుండి 65 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు జరిగాయని, 2021-22లో 95 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకుందని అన్నారు. చైనా ఉత్పత్తులు దిగుమతి ఆపిన రోజే.. చైనా గుణపాఠం నేర్చుకుంటుందని ఆయన అన్నారు. 

Kejriwal appeals to people Boycott Chinese goods
Author
First Published Dec 18, 2022, 4:36 PM IST

చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. 2020-21లో చైనా నుండి 65 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు జరిగాయని, 2021-22లో 95 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకుందని అన్నారు. చైనా ఉత్పత్తులు దిగుమతి ఆపిన రోజే.. చైనా గుణపాఠం నేర్చుకుంటుందని ఆయన అన్నారు.

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనా సైనికుల మధ్య ఇటీవల జరిగిన ఘర్షణకు తీవ్రంగా ఖండించారు. మన సైనికులు దేశానికే గర్వకారణమని, వారి ధైర్యసాహసాలకు నమస్కరిస్తున్నానన్న కేజ్రీవాల్‌.. ఆ దాడి  గాయపడ్డిన సైనికులు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ ఘటనకు నిరసనగా.. చైనాతో వాణిజ్యంపై నిషేధం విధించాలని అన్నారు.ఆ దేశ వస్తువులను బహిష్కరించాలని ప్రజలను కోరారు. ఈ నిర్ణయంపై  కేంద్ర ప్రభుత్వం గట్టిగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు.

న్యూఢిల్లీలో ఆదివారం నిర్వహించిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ.. దేశంలో ఏర్పడిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పేదరికానికి  చైనా దురాక్రమణ కూడా కారణమని అన్నారు. తవాంగ్ ఘర్షణపై మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా చైనా మమ్మల్ని బెదిరిస్తోందనీ, మన జవాన్లు చైనా బలగాలను ధైర్యంగా ఎదుర్కొంటున్నారనీ, డ్రాగన్ సైన్యంతో పోరాడుతున్నారనీ, ఎంతో మంది సైనికులు దేశం కోసం త్యాగాలు చేస్తున్నారని తెలిపారు. 

చైనా దిగుమతుల వివరాలను తెలుపుతూ.. 2020-21లో చైనా నుండి 65 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు జరిగాయని, 2021-22లో 95 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను భారత్ దిగుమతి చేసుకుందని అన్నారు. ఆ దిగుమతులను ఆపే రోజు చైనా గుణపాఠం నేర్చుకుంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చైనా నుండి దిగుమతులను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిస్సహాయంగా వ్యవహరిస్తుందని ప్రశ్నించారు. బొమ్మలు, చెప్పులు,బట్టలు వంటి అనేక వస్తువులు చైనా నుండి దిగుమతి అవుతున్నాయనీ,  ఈ వస్తువులను మన దేశంలో కూడా తయారు చేసుకోవచ్చని అన్నారు.

ఈ విషయంలో కేంద్రం ఎందుకు నిస్సహాయంగా వ్యవహరిస్తుందని అన్నారు. మనకు చవకైన చైనీస్ వస్తువులు అవసరం లేదనీ, అటువంటి ఉత్పత్తులను భారతదేశంలో తయారు చేస్తే ప్రీమియం ధర చెల్లించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారాయన. ఆప్ భావజాలానికి బలమైన దేశభక్తి, నిజాయితీ పట్ల నిబద్ధత, మానవత్వం మూడు స్తంభాలు అని, ప్రజలకు సేవ చేయాలనే ఆప్ ఉత్సాహాన్ని వారు నడిపిస్తున్నారని కేజ్రీవాల్ అన్నారు.తనకు, తన పార్టీకి దేవుడి ఆశీస్సులు ఉన్నాయనీ, మంచి పని చేసినందుకు తనని ప్రజలు ఎంపిక చేశారని అన్నారు. 

 ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నివేదికను ఉటంకిస్తూ.. జాతీయ ద్రవ్యోల్బణం రేటు 7.4%కి చేరిందని, అయితే ఢిల్లీలో ద్రవ్యోల్బణం రేటు 4%గా ఉందని కేజ్రీవాల్ అన్నారు. రాజధానిలో చాలా విషయాలు ఉచితం కాబట్టి. యూపీ, ఎంపీ, గుజరాత్‌లో 8% ద్రవ్యోల్బణం ఉందనీ, ఆప్ ప్రభుత్వాన్ని నడుపుతుంటే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయవచ్చని కేజ్రీవాల్ అన్నారు. 

కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలమైన వ్యాపార వాతావరణాన్ని కల్పించనందున గత ఐదేళ్లలో 12.5 లక్షల మంది అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు దేశం విడిచి వెళ్లారని ఆప్ జాతీయ నాయకుడు పేర్కొన్నారు. నిజాయితీగా పని చేయాలనుకునే వారు కేంద్రం వల్ల ఇబ్బంది పడుతున్నారని, ఇది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి ఏజెన్సీలను ఉపయోగిస్తుందని, ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడటానికి ధైర్యం చేస్తే.. వారిని నేరస్థులుగా క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios