విభేదాలను పక్కన పెట్టి పార్టీ విజయానికి కృషి చేయండి : కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే
Hyderabad: హైదరాబాద్ లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తూ దేశం ఎదుర్కొంటున్న పలు కీలక అంశాలను ప్రస్తావించారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా భారత జాతీయ కాంగ్రెస్ పాత్రను నొక్కి చెప్పిన ఖర్గే, సాధారణ ప్రజల ఆందోళనలు, సమస్యలను పరిష్కరించడానికి పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దేశ ప్రస్తుత పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఖర్గే వివిధ అంశాల్లో మోదీ ప్రభుత్వ పనితీరును తప్పుబట్టారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మణిపూర్ లో హింస, పెరుగుతున్న అసమానతలు, రైతులు, కార్మికుల క్షీణిస్తున్న పరిస్థితులు వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు.

Congress president Mallikarjun Kharge: విభేదాలు, వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి అహర్నిశలు పనిచేసి పార్టీ విజయానికి ప్రాధాన్యమివ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. హైదరాబాద్ లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ నాయకులు స్వీయ నియంత్రణ పాటించాలనీ, పార్టీకి వ్యతిరేకంగా మీడియాకు ప్రకటనలు చేయడం మానుకోవాలని, తద్వారా పార్టీ ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడాలని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పార్టీ ఏకమై నియంతృత్వ ప్రభుత్వాన్ని కూలదోయాలని ఈ సమావేశంలో ఖర్గే పిలుపునిచ్చారు. సంస్థాగత ఐక్యత ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన ఆయన, కర్ణాటకలో మాదిరిగా క్రమశిక్షణ ద్వారా కాంగ్రెస్ తన ప్రత్యర్థులను ఓడించగలదని అన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారనీ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లలో కాంగ్రెస్ సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనమని ఖర్గే అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి పార్టీ పూర్తి బలంతో, స్పష్టమైన సందేశంతో ముందుకు వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు.
'ముందున్న సవాళ్ల గురించి మనందరికీ తెలుసు. ఈ సవాళ్లు కేవలం కాంగ్రెస్ పార్టీవి మాత్రమే కాదు. అవి భారత ప్రజాస్వామ్య మనుగడకు, భారత రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించినవి' అని ఖర్గే పేర్కొన్నారు. పార్టీకి విశ్రాంతి ఇచ్చే సమయం ఇది కాదని ఆయన అన్నారు. గత పదేళ్ల బీజేపీ పాలనలో సామాన్యులు ఎదుర్కొంటున్న సవాళ్లు రెట్టింపయ్యాయని ప్రధాని నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు. పేదలు, రైతులు, కూలీలు, మహిళలు, యువత సమస్యలను పరిష్కరించడానికి ప్రధాని నిరాకరిస్తున్నారని అన్నారు.
హైదరాబాద్ లో సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తూ దేశం ఎదుర్కొంటున్న పలు కీలక అంశాలను ప్రస్తావించారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా భారత జాతీయ కాంగ్రెస్ పాత్రను నొక్కి చెప్పిన ఖర్గే, సాధారణ ప్రజల ఆందోళనలు, సమస్యలను పరిష్కరించడానికి పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దేశ ప్రస్తుత పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఖర్గే వివిధ అంశాల్లో మోదీ ప్రభుత్వ పనితీరును తప్పుబట్టారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మణిపూర్ లో హింస, పెరుగుతున్న అసమానతలు, రైతులు, కార్మికుల క్షీణిస్తున్న పరిస్థితులు వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు.
మణిపూర్, ఇండియా బ్లాక్, అదానీ అంశాంలపై సీడబ్ల్యూసీ తీర్మానం
పునర్ వ్యవస్థీకరణ తర్వాత తొలి సమావేశం నిర్వహించిన సీడబ్ల్యూసీ ఆమోదించిన 14 అంశాల తీర్మానంలో ఆ పార్టీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. మణిపూర్ లో రాజ్యాంగ యంత్రాంగాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేయడం, కొనసాగుతున్న హింసపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. నాలుగు నెలలకు పైగా బీజేపీ పోలరైజేషన్ ఎజెండాతో రాష్ట్రం తీవ్రంగా చీలిపోయిందని కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి ఆరోపించింది. ప్రధాని (మోడీ) మౌనం, నిర్లక్ష్యం, హోం మంత్రి (షా) వైఫల్యం, ముఖ్యమంత్రి (ఎన్ బీరెన్ సింగ్) మొండివైఖరి వల్ల భద్రతా దళాలు, పౌరుల మధ్య, ఆర్మీ/ అస్సాం రైఫిల్స్, రాష్ట్ర పోలీసు బలగాల మధ్య పదేపదే ఘర్షణలు జరిగే దారుణ పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ ఆరోపించింది. చైనాతో సరిహద్దు వివాదంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలనీ, భారత ప్రాదేశిక సమగ్రతకు ఎలాంటి సవాలు ఎదురైనా దృఢమైన వైఖరి తీసుకోవాలని సీడబ్ల్యూసీ పిలుపునిచ్చింది. అదానీ వ్యవహారంలో వెలుగుచూసిన షాకింగ్ విషయాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలన్న పార్టీ డిమాండ్ ను పునరుద్ఘాటించింది.