భారత వైమానిక దళం సాహసోపేతమైన ఆపరేషన్  చేసింది.  కేదార్‌నాథ్‌ గగనతలంలో ప్రయాణిస్తున్న ఓ విమానంలో   సాంకేతిక సమస్యలు తలెత్తడంతో 1500 అడుగులో ఎత్తులో హెలిప్యాడ్‌ వద్ద  ఆ ప్లైట్ కూలిపోయింది. 

భారత వైమానిక దళం ఎంత సాహసోపేతమైందో మరోసారి నిరూపితమైంది. కేదార్‌నాథ్‌ సమీపంలో కూలిపోయిన ఓ విమానాన్ని చాకచక్యంతో వైమానిక దళం కాపాడింది.
యుటి ఎయిర్‌ ప్రైవేటు అనే విమానం కేదార్‌నాథ్‌ ప్రాంతానికి వెళ్ళింది. అయితే అక్కడ ఆ విమానం ప్రయాణిస్తున్న సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో 1500 అడుగులో ఎత్తులో హెలిప్యాడ్‌ వద్ద ఆ ప్లైట్ కూలిపోయింది. 

జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో మోదీ

దీంతో ఆ విమానాన్ని అక్కడి నుంచి బయటకు తీసుకరావడం కోసం సదురు సంస్థ భారత వైమానిక దళాన్ని కోరింది. త్వరలో కేదార్‌నాథ్‌ దేవాలయాన్ని మూసివేయనున్న తరుణంలో అంతలోపే ఆ విమానాన్ని బయటకు తీసుకరావాలని ఎయిర్‌పోర్స్ ప్రతినిదులకు విఙ్ఞప్తి చేసింది.

వారి విఙ్ఞప్తి మేరకు ఈ నెల 26న ఎమ్‌ఐ-17, వీ5 అనే రెండు భారత వైమానిక దళ విమానాలు రంగంలోకి దిగాయి. సదరు విమానాన్ని ఘటనా ప్రాంతం నుంచి బయటక తీసుకుని వచ్చాయి. ఈ ఆపరేషన్ను ఇండియన్ ఎయిర్‌పోర్స్ సవాలు తీసుకుని విజయవంతంగా పూర్తి చేసింది. కూలిన విమానాన్ని హెలికాప్టర్‌కు కింది భాగాన కట్టిఎమ్‌ఐ-17కి తగిలించారు.

దీపావళి ఆఫర్: 1రూపాయికి షర్ట్,10 కి నైటీ

 అనంతరం కూలిన విమానాన్ని పైకి తీసి డెహ్రడూన్‌లోని సహస్త్రధార ప్రాంతానికి తరిలించారు. కేదార్‌నాథ్‌ ప్రాంతం ఎతైన కొండలు, ఇరుకైన లోయలతో కూడి ఉంటుంది కావున కూలిన విమానాన్ని పైకి తీసుకరావడం సవాలుతొ కూడికున్నది. 

అయినప్పటికీ ఐఏఎఫ్‌ దీనిని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఆపరేషన్‌పై భారత వైమానికి దళ ప్రతినిధి స్పందించారు. ఈ కష్టతరమైన ఈ అపరేషన్‌ను వైమానిక దళం విజయవంతంగా పూర్తి చేయగలిగిందని పేర్కొన్నారు. 

Scroll to load tweet…