Asianet News TeluguAsianet News Telugu

జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో మోదీ

నరేంద్ర మోడి సైనికులతో కలిసి దీవాళీ వేడుకలలో పాల్గోననున్నారు. కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తి హోదాను తొలగించిన తర్వాత తొలిసారిగా   జమ్ముకాశ్మీర్‌లో పర్యటించనున్నారు.

pm-modi-in-jks-rajouri-to-celebrate-diwali-with-troops-on-loc
Author
Jammu and Kashmir, First Published Oct 27, 2019, 4:58 PM IST


ప్రధాని నరేంద్ర మోడి సైనికులతో కలిసి దీవాళీ వేడుకలలో పాల్గొననున్నారు. జమ్మూకాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) పని చేస్తున్న సైనికులతో కలిసి  ఆయన ఈ వేడుకల్లో పాల్గోంటారు. ఢీల్లి నుంచి ప్రత్యేక  విమానంలో  రాజౌరి జిల్లాకు చేరుకుని  అక్కడి నుంచి  నియంత్రణ రేఖ వద్దకు  వెళ్ళి సైనికులతో ఉల్లాసంగా గడిపనున్నారు.
  

 భూలోక స్వర్గం సీమ  జుమ్ముకాశ్మీర్‌ను పాక్ చేరలోకి వెళ్ళకుండా అడ్డుకోవడానికి 1947 లో భారత బలగాలు ఎక్కడైతే మెుట్టమెుదటిగా అడుగుపెట్టాయో అక్కడ మోదీ సైనికులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకోనున్నారు. సరిహద్దులో ఉన్న  ఆర్మీ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయానికి చేరుకుని  అక్కడ  భారత దళాలతో నేరుగా  ముచ్చటిస్తారు. 

2014 నుండి సరిహద్దు ప్రాంతాలలో దళాలతో కలిసి ఆయన దీపావళిని జరుపుకోవడం ఇది మూడోసారి,   కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తి హోదాను తొలగించిన తర్వాత తొలిసారిగా  ప్రధాని అక్కడ పర్యటించనున్నారు..

Follow Us:
Download App:
  • android
  • ios