చెన్నై: చెన్నైలోని ఒక వస్త్ర దుకాణం దీపావళికి స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. పండగపూట పేదలు కూడా కొత్త బట్టలు వేసుకొని ఆనందమయంగా పండగ జరుపుకోవాలనేది ఈ దుకాణం యజమాని అభిలాష. అందుకోసం దీపావళికి ఒక వారం ముందు నుంచి ఈ ఆఫర్ కింద బట్టలను పెద్ద ప్రజలకు అందించాడు. 

ఒక షర్ట్ ను కేవలం ఒక్క రూపాయికి, ఒక నైటీని 10 రూపాయలకు విక్రయించాడు. పండగనేది కేవలం ఏ కొద్దిమందికో మాత్రమే కాకుండా అందరికి చేరువ చేయడానికి ఇలా బట్టలను అందించినట్టు దుకాణం యజమాని తెలిపాడు.  

చెన్నై ట్రిప్లికేన్ ప్రాంతంలోని చాకలిపేట్ ఏరియాలో ఆనంద్ అనే ఒక వ్యక్తి వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నాడు. దీపావళికి వారం ముందు నుంచి 19వ తేదీ నుండి నిన్న 26వ తేదీ వరకు రోజు ఒక గంటపాటు ఉదయం 10 నుండి 11గంటల వరకు ఇలా అమ్మేవాడు. తొలి రోజుల్లో కేవలం 50 మందికి మాత్రమే ఇచ్చేవాడు. రానురాను రద్దీ పెరగడంతో రోజుకి 200 మందికి ఇలా ఇవ్వడం ప్రారంభించాడు. 

రూపాయికి ఏమి రాదూ కదా,మరి ఎందుకు ఇలా రూపాయి తీసుకోవడం?దాని బదులు ఉచితంగా ఇవ్వొచ్చు కదా అని అడిగితే,ఫ్రీగా ఇస్తే విలువ తెలియదు,అందుకే ఇలా రూపాయి తీసుకోవడం అని సమాధానమిస్తున్నారు మోహన్.