Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ మాట్లాడుతుండగానే వెళ్లిపోయేందుకు సిద్దమైన నితీష్.. బీజేపీ సెటైర్లు.. అసలేం జరిగిందంటే..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం బిహార్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో భేటీ అయిన కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై చర్చించారు. నితీష్ కుమార్, కేసీఆర్‌లు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించగా.. అక్కడ చోటుచేసుకున్న ఓ పరిణామం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

KCR urging Nitish Kumar not to leave press meet Video goes viral
Author
First Published Sep 1, 2022, 2:56 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం బిహార్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో భేటీ అయిన కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై చర్చించారు. 2024 సార్వత్రిక ఎన్నికలను లక్ష్యంగా  చేసుకుని చేసుకుని వివిధ ప్రతిపక్ష నేతలను కలుస్తున్న కేసీఆర్.. ‘‘బీజెపి-ముక్త్ భారత్’’ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తానని చెప్పారు. అయితే విపక్షాల ఐక్యతలను ప్రదర్శించడానికి నితీష్ కుమార్, కేసీఆర్‌లు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించగా.. అక్కడ చోటుచేసుకున్న ఓ పరిణామం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఆ వీడియోను బేస్ చేసుకుని విపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంది. 

అసలేం జరిగిందంటే.. పాట్నాలో కేసీఆర్, నితీష్ కుమార్‌లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మీడియా ప్రతినిధులు.. 2024లో విపక్షాల ప్రధాని అభ్యర్థికి గురించి ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నతో ఇద్దరు నేతలు కొంత ఇబ్బంది పడినట్టుగా కనిపించింది. అయితే ఈ క్రమంలోనే నితీష్ కుమార్ మీడియా సమావేశంలో నుంచి వెళ్లిపోయేందుకు లేచి నిల్చున్నారు. అయితే కేసీఆర్ మాత్రం ఆయన వెళ్లకుండా.. కూర్చొవాలని అడిగారు. ఆయన చేతిని కూడా పట్టుకుని కూర్చొవాలని చెప్పారు. కానీ నితీష్ కుమార్ మాత్రం వెళ్దామని అన్నారు. 

‘‘ఆప్ బైతియే నా (దయచేసి కూర్చోండి)’’ కేసీఆర్ అనగా.. ‘‘ఆప్ చలియే నా (వెళ్దాం)’’ అని నితీష్ కుమార్ పట్టుబట్టారు. ఇద్దరు నాయకులు ఒకరినొకరు ‘‘బైతియే’’, ‘‘చలియే’’ అని చెప్పుకుంటూనే ఉన్నారు. కేసీఆర్ మాత్రం ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా నిలబడిన ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చి ప్రధాని అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తాయని కేసీఆర్ చెప్పారు. తాను పేరు ప్రపోజ్ చేస్తే జనం స్వీకరిస్తారని ఎవరు చెప్పారు?.. మీరెందుకు (విలేకరులు) తొందరపడుతున్నారు.. దీనిపై మేం (ప్రతిపక్ష పార్టీలు) కూర్చుని మాట్లాడుకోవాల్సి ఉందని అన్నారు. 

 


‘‘నేను కూర్చున్నాను, మీరు కూడా కూర్చోండి’’ అని కేసీఆర్ విలేకరులతో చెప్పగా..  ఆ సమయంలో నితీష్ కుమార్ ఇంకా నిలబడే ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ విపక్షాల ఎంపిక కాగలరా అన్న ప్రశ్న అడిగిన సమయంలో.. ‘‘నువ్వు తెలివైనవాడివి.. కానీ నేను అంతకంటే తెలివైనవాడిని’’ అని కేసీఆర్ మండిపడ్డారు. ఆ సమయంలో మళ్లీ కొద్దిసేపు కుర్చిలో కూర్చొన్నారు. 

బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకతాటిపైకి తెచ్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తాం అని కేసీఆర్ చెప్పారు. ఈ క్రమంలోనే నితీష్ కుమార్.. ‘‘ఇక వెళ్దాం.. వీటన్నింటిలోకి ప్రవేశించవద్దు’’ అని అన్నారు. కేసీఆర్ కూర్చొమని అడగ్గా.. అయిపోయింది ఇక వెళ్దామని నితీష్ అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని విపక్షాల వైరుధ్యానికి ఉదాహరణగా అర్థం చేసుకోవచ్చని బీజేపీ నేతలు, మద్దతుదారులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. కేసీఆర్‌ను నితీష్ కుమార్ అవమానించారని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. 

అయితే బీజేపీ నేతల నుంచి వస్తున్న విమర్శలపై నితీష్ కుమార్ సన్నిహిత వర్గాలు స్పందించాయి. అక్కడ ఏమి జరిగిందో తప్పుగా అర్థం చేసుకున్నారని నితీష్ సన్నిహిత వర్గాలు చెప్పినట్టుగా ఎన్డీటీవీ రిపోర్ట్ చేసింది. విలేకరులు ప్రశ్నలు పదే పదే అడిగినప్పుడు మాత్రమే నితీష్ కుమార్ వెళ్లేందుకు సిద్దమయ్యారని వారు అంటున్నారు.

ఈ వీడియోను షేర్ చేసిన బీజేపీ ఐటీ సెల్ ఇంచార్జ్ అమిత్ మాలవీయ.. ‘‘ఇలా అవమానం పొందడానికే  కేసీఆర్ పాట్నా యాత్రకు వెళ్లారా?. ఒక ప్రెస్ ఇంటరాక్షన్‌లో కేసీఆర్ అభిప్రాయాన్ని పూర్తి చేసే ప్రాథమిక మర్యాదను కూడా అతనికి నితీష్ కుమార్ ఇవ్వలేదు. తాను ముగించాలని కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని నితీశ్ తోసిపుచ్చారు’’ అని అన్నారు. అది అహంకారమని విమర్శించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios