Asianet News TeluguAsianet News Telugu

అమితాబ్ కేబీసీపై కరోనా ప్రభావం.. షాకింగ్ డెసిషన్

కేబీసీ-12 క్రియేటివ్ ప్రొడ్యూసర్ సుజాత సంఘమిత్ర మాట్లాడుతూ తాము ప్రతీసారీ నిర్వహించే కేబీసీకి ఇప్పుడు నిర్వహిస్తున్న కేబీసీకి చాలా తేడా ఉన్నదన్నారు. కరోనా కారణంగా పలు జాగ్రత్తలు తీసుకుంటూ, షూటింగ్ చేస్తున్నామన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఈ షో కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

KBC 12 will have no audience poll: What are the new rules and changes?
Author
Hyderabad, First Published Sep 23, 2020, 1:54 PM IST

బాలీవుడ్ అగ్ర కథనాయకుడు అమితాబ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియాల్టీ గేమ్ షో ‘ కౌన్ బనేగా కరోడ్ పతి’. ఈ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షోలో పాల్గొని రూ.కోటి గెలుచుకోవాలని చాలా మంది ప్రయత్నించారు. అంతెందుకు.. ఈ షో కి ఉన్న క్రేజ్ ని గుర్తించి తర్వాత వివిధ బాషల్లోనూ పరిచయం చేశారు. తెలుగులో సైతం మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ ప్రోగ్రాం చేశారు. కాగా.. ఇప్పుడు ఈ షోపై కరోనా ప్రభావం పడింది.

 కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్-12 త్వరలో ప్రారంభం కానుంది. అయితే కరోనా కారణంగా ఈ షోలో పలుమార్పులు చేర్పులు చోటుచేసుకోబోతున్నాయి. సోషల్ డిస్టెన్సింగ్‌కు అత్యంత ప్రాధాన్యతనివ్వనున్నారు. ఈ సందర్భంగా కేబీసీ-12 క్రియేటివ్ ప్రొడ్యూసర్ సుజాత సంఘమిత్ర మాట్లాడుతూ తాము ప్రతీసారీ నిర్వహించే కేబీసీకి ఇప్పుడు నిర్వహిస్తున్న కేబీసీకి చాలా తేడా ఉన్నదన్నారు. కరోనా కారణంగా పలు జాగ్రత్తలు తీసుకుంటూ, షూటింగ్ చేస్తున్నామన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఈ షో కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

కరోనా కారణంగా ప్రపంచంలో పనిచేసే తీరు మారిపోయిందని, ఇటువంటి పరిస్థితిలో కేబీసీని కూడా విభిన్నంగా నిర్వహిస్తున్నామన్నారు. కేబీసీ సెట్ సంపూర్ణంగా మార్చివేశామని, డిజిటల్ ఆడిషన్స్ నిర్వహించామన్నారు. ఈ సారి షోలో ఆడియన్స్ ఉండరని, అందుకే ఆడియన్స్ పోల్ లైఫ్‌లైన్ ఉందదని అన్నారు. ఆడియన్స్ పోల్ లేకుండా షో నిర్వహించడం ఇదే తొలిసారని అన్నారు. దీని స్థానంలో వీడియో ఆఫ్ ఫ్రెండ్ అనే కొత్త ఆప్షన్ ప్రవేశపెడుతున్నామని అన్నారు. దీని ద్వారా కంటెస్టెంట్ సమాధానం చెప్పేటప్పుడు వీడియో ద్వారా స్నేహితుల సహాయం తీసుకోవచ్చన్నారు. గతంలో ఫాస్టెస్ట్ ఫింగర్ సీట్స్‌లో 10 మంది కూర్చొనేవారని, ఇప్పుడు వారి సంఖ్యను 8కి తగ్గించి, సోషల్ డిస్టెన్సింగ్ ఉండేలా చూస్తున్నామన్నారు. గతంలో కంటెస్టెంట్ల ఇంటికి వెళ్ల షూటింగ్ చేసేవారమని, ఇప్పుడు అలా చేయడంలేదన్నారు. దీనికి బదులుగా కంటెస్టెంట్ స్వయంగా తన వీడియోను పంపించాల్సివుంటుందన్నారు. ఇందుకోసం తమ బృందం వారికి సలహాలు, సూచనలు అందజేయనుందని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios