చంద్రయాన్-3 విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారని కాశ్మీర్ కు చెందిన విద్యార్థులు, పలువురు విద్యార్థులపై దాడి చేశారు. ఈ ఘటన రాజస్థాన్ లోని మేవార్ విశ్వవిద్యాలయంలో చోటు చేసుకుంది. దీనిపై ఆ విశ్వవిద్యాలయం అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది.

కాశ్మీరీ విద్యార్థులు, ఇతర విద్యార్థుల మధ్య ఘర్షణలతో రాజస్థాన్ లోని మేవార్ విశ్వవిద్యాలయం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి ఘర్షణలకు కారణం చంద్రయాన్-3 విజయోత్సవ వేడుకలేనని తెలుస్తోంది. ‘జీ న్యూస్’ కథనం ప్రకారం.. మేవార్ యూనివర్శిటీలో రెండు విద్యార్థి వర్గాల మధ్య జరిగిన చిన్న వివాదం తీవ్రరూపం దాల్చి రాళ్లు రువ్వడం, కత్తి దాడికి దారితీసింది.

యూనివర్శిటీ నుంచి అందిన సమాచారం ప్రకారం, యూనివర్శిటీ మెస్ లో ఈ గొడవ ప్రారంభమైంది, అక్కడ భోజనం చేస్తూ కూర్చున్న రాహుల్ అనే విద్యార్థిని కొందరు కశ్మీరీ విద్యార్థులు కొట్టారు. అయితే అసలు కారణం చంద్రయాన్-3 విజయానికి సంబరాలు అని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘర్షణలో ఇద్దరు విద్యార్థులు ఆయుష్, కృష్ణపాల్ శర్మ తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. 

గులాబ్పురాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి ఆయుష్ శర్మ ఆగస్టు 23 న చంద్రయాన్-3 విజయవంతమైనందుకు యూనివర్సిటీలో సంబరాలు జరుపుకున్నారు. ఇది కొందరు కాశ్మీరీ విద్యార్థులకు నచ్చలేదు. విక్రమ్ సాఫ్ట్ గా ల్యాండ్ కావడం పట్ల ఆయుష్ ఆనందం వ్యక్తం చేస్తూ.. భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలు చేశారు. దీంతో అక్కడే ఉన్న 10 నుంచి 12 మంది కాశ్మీరీ విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కృష్ణపాల్ శర్మతో పాటు మరి కొందరు ఆయుష్ శర్మకు మద్దతుగా నిలిచారు. దీంతో మరో వర్గం విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పదునైన ఆయుధాలతో దాడి చేశారు. 

హిందూ విద్యార్థులతో గొడవపడిన తర్వాత కాశ్మీరీ విద్యార్థులు యూనివర్సిటీ క్యాంపస్ లో పదునైన ఆయుధాలు, కర్రలు ప్రదర్శించారని స్థానిక విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై మేవార్ యూనివర్సిటీ యాజమాన్యం ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీనిపై వర్సిటీ యాజమాన్యం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై నివేదిక రావాల్సి ఉంది. కాగా.. కాశ్మీరీ విద్యార్థులు అల్లాహు అక్బర్ నినాదాలు చేస్తూ హంగామా సృష్టిస్తున్న కొన్ని వీడియోలు కూడా ఆన్ లైన్ లో ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది.

Scroll to load tweet…

ఈ ఘటనపై సమాచారం అందుకున్న హిందూ సంఘాల అధికారులు జిల్లా ఆస్పత్రికి చేరుకుని నిందితులైన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం కేసులో శాంతికి భంగం కలిగించిన 36 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఈ ఘటన తర్వాత వర్సిటీ క్యాంపస్ వెలుపల అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఇరు వర్గాల విద్యార్థులు శాంతిని పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.