Asianet News TeluguAsianet News Telugu

భారత సంతతి ప్రొఫెసర్‌ ఘనత: ముబారక్ ఉస్సేన్ సయ్యద్‌కి రూ. 13 కోట్ల ఫెలోషిప్

భారత సంతతికి చెందిన ముబారక్ ఉస్సేన్ సయ్యద్ కు అమెరికాలో ప్రతిష్టాత్మక కెరీర్ ఫెలో‌షిప్ అవార్డు దక్కింది.

Kashmiri neuroscientist receives Rs 13 crore fellowship to complete project lns
Author
Jammu Kashmir Study Centre, First Published Jan 17, 2021, 1:35 PM IST

న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన ముబారక్ ఉస్సేన్ సయ్యద్ కు అమెరికాలో ప్రతిష్టాత్మక కెరీర్ ఫెలో‌షిప్ అవార్డు దక్కింది.

అమెరికాలోని న్యూ మెక్సికో యూనివర్శిటీ న్యూరాలజీ విభాగంలో ముబారక్ ఉస్సేన్ సయ్యద్  ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. కాశ్మీర్ లోని బుద్గాం జిల్లాకు చెందిన సయ్యద్ స్థానికంగానే విద్యను అభ్యసించాడు.జర్మనీలో ఆయన పీహెచ్‌డీ పూర్తి చేశాడు. 

మెదడుపై చేస్తున్న ప్రయోగానికి యూఎస్ నేషనల్ సైన్స్ పౌండేషన్ దీనిని ప్రదానం చేసింది. ఇందుకు గాను ఐదేళ్ల కాలంలో రూ. 13 కోట్ల పెలో‌షిప్ ఆయనకు అందించనుంది.ఎన్ఎస్ఎఫ్ కు ముబారక్ ధన్యవాదాలు తెలిపారు. తనకు సహకరించినవారితో పాటు తన వెన్నంటి ఉండి నిరంతరం సలహాలు సూచనలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు చెప్పారు. 

ఈ అవార్డు ద్వారా ల్యాబ్ అధారిత న్యూరో జెనెటిక్స్ ల్యాబ్ కోర్సులో ప్రయోగాలు చేయడానికి అండర్ గ్రాడ్యుయేట్ పరిశోధకులను నియమించాలని తాను లక్ష్యంగా పెట్టుకొంటున్నట్టుగా ఆయన చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios