చెన్నైలోని డీఎంకే కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి కాంస్య విగ్రహాన్ని యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు, కేరళ సీఎం పినరయి విజయన్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కరుణానిధి కుమారుడు, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సహా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనియా, చంద్రబాబు ఒకే వేదికపైకి రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, విగ్రహావిష్కరణ తర్వాత రాహుల్ గాంధీ తన ఫోన్‌తో కరుణ విగ్రహాన్ని ఫోటో తీసుకున్నారు.