Karni Sena Chief : కర్ణిసేన చీఫ్ సుఖ్ దేవ్ సింగ్ గోగామేడి దారుణ హత్య..బాధ్యత వహించిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్
Karni Sena Chief Sukhdev Singh Gogamedi : రాష్ట్రీయ రాజ్ పుత్ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్ దేవ్ సింగ్ గోగామేడి తన ఇంట్లో సమీపంలోనే దారుణ హత్యకు గురయ్యారు. స్కూటర్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆయనను కాల్చి చంపారు. దీనికి గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు రోహిత్ గోదారా బాధ్యత వహించాడు.
Karni Sena Chief Sukhdev Singh Gogamedi : రాష్ట్రీయ రాజ్ పుత్ కర్ణిసేన చీఫ్ సుఖ్ దేవ్ సింగ్ గోగమేడి జైపూర్ లో దారుణ హత్యకు గురయ్యారు. స్కూటర్ పై వచ్చిన ముగ్గురు దుండగులు ఆయనపై ఆకస్మాత్తుగా కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్ర గాయాలతో సుఖ్ దేవ్ సింగ్ మరణించాడు. అయితే ఈ హత్యకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. ఈ గ్యాంగ్ కు చెందిన రోహిత్ గోదారా ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా ప్రకటించాడు.
వివరాలు ఇలా ఉన్నాయి. జైపూర్ లోని తన నివాసం వద్ద రాష్ట్రీయ రాజ్ పుత్ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్ దేవ్ సింగ్ గోగామేడి నిలబడి ఉన్నాడు. అయితే అక్కడికి స్కూటర్ పై ముగ్గురు వ్యక్తులు వచ్చారు. వారి దగ్గర ఉన్న తుపాకీ తీసి పలుమార్లు కాల్పులు జరిపారు. అలాగే గుమ్మం వద్ద నిలబడిన మరో వ్యక్తిపై కూడా దుండగులు కాల్పులు జరిపారు.
అయితే ఊహించని ఈ పరిణామానికి సుఖ్ దేవ్ సింగ్ గోగామేడి తీవ్రంగా గాయపడి నేలపై కూలిపోయాడు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. నేలకూలిన గోగామేడిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. కానీ బుల్లెట్ గాయాలు తీవ్రంగా కావడంతో పరిస్థితి విషమించి మృతి చెందారు. ఈ ఘటనలో గోగమేడితో పాటు ఉన్న అజిత్ సింగ్ తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
కాగా.. ఈ హత్య జరిగిన కొన్ని గంటల తరువాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడైన రోహిత్ గోదారా ఓ ఫేస్ బుక్ పోస్ట్ పెట్టాడు. అందులో సుఖ్ దేవ్ సింగ్ గోగామేడి హత్యకు తామే బాధ్యులమని ప్రకటించాడు. రాజస్థాన్ కు చెందిన కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ రోహిత్ గోదారా ప్రస్తుతం భారత్ నుంచి పారిపోయాడు. గతంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కూడా ఆయనపై చర్యలు తీసుకుంది.