కర్ణాటక సీఎం తన మంత్రివర్గంలో 29 మందికి చోటు కల్పించారు. కొత్త మంత్రివర్గం జాబితాలో మాసీ సీఎం యడియూరప్ప తనయుడికి చోటు దక్కలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మంత్రివర్గ కూర్పు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 


బెంగుళూరు: కర్ణాటక కొత్త సీఎం బసవరాజ్ బొమ్మై తన మంత్రివర్గంలోకి 29 మందిని తీసుకొన్నారు. కొత్త మంత్రుల జాబితాలో మాజీ సీఎం యడియూరప్ప తనయుడు బీఎస్ విజయేంద్రకు కేబినెట్‌లో చోటు దక్కలేదు.

also read:బసవరాజ్ బొమ్మై మంత్రివర్గంలో 29 మంది: లింగాయత్‌లకు పెద్దపీట

29 మంది కొత్త మంత్రులు బుధవారం నాడు రాజ్‌భవన్ లో ప్రమాణం చేశారు. గోవింద్ కర్జోల్,కేఎస్ ఈశ్వరప్ప, ఆర్. ఆశోక, బి. శ్రీరాములు, వి. సోమన్న, ఉమేష్ కత్తి, ఎస్. అంగర, జేసీ మధుస్వామి, అరగ జానేంద్ర,సీఎస్ ఆశ్వథ్ నారాయణ, సీపీ పటేల్, ఆనంద్ సింగ్, కోట శ్రీనివాస పూజారి, ప్రభు చౌహాన్, మురుగేష్ నిరానీ, శివరామ హెబ్బార్, ఎస్టీ సోమశేఖర్ బీసీ పటేల్, బసవరాజ్, డాక్టర్ కె. సుధాకర్, కె. గోపాలయ్య, శశికల జొల్లె, ఎంబీటి నాగరాజ్, కేసీ నారాయణ గౌడ, బీసీ నగేష్, వి. సునీల్ కుమార్ హాలప్ప ఆచార్, శంకర్ పాటిల్ ముననకొప్ప, మునిరత్నకొత్త మంత్రులుగా ప్రమాణం చేశారు.

కొత్త మంత్రులతో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ రాజ్ భవన్ లో ప్రమాణం చేయించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బసవరాజ్ బొమ్మై ఢిల్లీ వెళ్లి ఇవాళ ఉదయమే బెంగుళూరు వచ్చారు. బెంగుళూరు వచ్చిన తర్వాత మంత్రులతో ప్రమాణం చేయించారు.