Asianet News TeluguAsianet News Telugu

‘మా ఊరికి రోడ్డు వేసేదాకా పెళ్లి చేసుకోను’.. ఓ టీచర్ శపథం... వీడియో వైరల్...

"మా గ్రామానికి మంచి కనెక్టివిటీ లేదు," అని బిందు చెప్పుకొచ్చింది. హెడ్నే గ్రామం నుండి మా ఊరికి వెళ్లే రెండు కిలోమీటర్ల మేర మట్టి రోడ్డు సంవత్సరాలుగా రిపేర్లు లేక అలాగే ఉంది. అంటూ వీడియో చేసి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. 

Karnataka : Teacher from Davanagere won t wed till village road is repaired
Author
Hyderabad, First Published Sep 16, 2021, 8:46 AM IST

దావణగెరె : కర్ణాటక దావణగెరె జిల్లాలోని హెచ్ రాంపూర్‌కు చెందిన ఒక స్కూల్ టీచర్ తన గ్రామానికి వెళ్లే రోడ్డు మరమ్మతులు చేసేంత వరకు వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేసింది. రోడ్డు బాగాలేని కారణంగా బయటి గ్రామాల వాళ్లు హెచ్ రాంపూర్‌లోని వారితో సంబంధం కలుపుకోవడానికి ఇష్టపడడం లేదని సదరు టీచర్ ఆర్ డి బిందు వాపోయింది. 

కారణం, ఈ ఊరికి బస్సు లేదు. అంతేకాదు గతుకులు, మట్టిరోడ్డు.. ఈ రోడ్డులో ప్రయాణిస్తే వెన్నుముక విరిగిపోవడం ఖాయం. ఆమె మాట్లాడుతూ.. "మా గ్రామానికి మంచి కనెక్టివిటీ లేదు," అని బిందు చెప్పుకొచ్చింది. హెడ్నే గ్రామం నుండి మా ఊరికి వెళ్లే రెండు కిలోమీటర్ల మేర మట్టి రోడ్డు సంవత్సరాలుగా రిపేర్లు లేక అలాగే ఉంది. అంటూ వీడియో చేసి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. 

ఈ మేరకు ఆమె ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి రాసిన లేఖకు సీఎం ప్రధాన కార్యదర్శి నుండి స్పందన వచ్చింది. సమస్యను పరిష్కరిస్తామని ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారు. దీని మీద బిందు మాట్లాడుతూ ‘ఈ రోడ్డును బాగు చేయడానికి మా ప్రజాప్రతినిధులకు కనీసం ఆరు నెలలు పడుతుందని చెప్పారు. అందుకే అప్పటి వరకు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను”అని అంటుంది. బిందు ఎకనామిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. బాగల్‌కోట్‌లోని కుడలసంగంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తుంది.

"మట్టి రోడ్డును తారు రోడ్డుగా మార్చాలి. మట్టి రోడ్డు వల్ల వర్షం పడితే చాలు గుంతలు, ఏర్పడడం, బురదతో నిండి పోయి.. జారిపోతూ నడవడం కష్టంగా ఉంటుంది. ఈ కారణంగా చాలా మంది వాహనదారులుబైక్ పై నుండి కిందపడి గాయపడ్డారు. అంతేకాదు.. మా ఊరునుంచి నగరానికి వెళ్లాలంటే.. నాయకొండ వరకు 5-7 కి.మీ.ల దూరం నడవాల్సి ఉంటుంది. కాలేజీలు, స్కూల్స్, ఏదైనా పని, అత్యవసరం ఏదైనా కానీ.. ఇదే పరిస్థితి. రోడ్డు బాగయ్యేవరకు పెళ్లి చేసుకోనని నా కూతరు చెప్పడం మంచి ఆలోచన’ అని బిందు తల్లి లతా దేవేంద్రప్ప అన్నారు.

ట్రాఫిక్ సిగ్నల్‌ దగ్గర మోడల్ డ్యాన్సింగ్.. వీడియో వైరల్.. చివరికి ఏమైందంటే?

దీనిమీద స్థానికులు మాట్లాడుతూ.. ‘రోడ్డు వేయాలని, బాగు చేయించాలని అనేకసార్లు మేము అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు మెమోరాండమ్‌లను సమర్పించాం. వాళ్ల చుట్టూ తిరిగాం, కానీ ప్రయోజనం లేకపోయింది" అని ఎకె రమేష్ అనే గ్రామస్తుడు తెలిపాడు. 

"మా ఊరికి రోడ్డు కనెక్టివిటీ సరిగా లేకపోవడం వల్ల ఊర్లో చాలామందికి వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్లిన సందర్బాలు అనేకం ఉన్నాయి. ఈ రోడ్డు లేని కారణంగానే మా గ్రామానికి బస్సు సౌకర్యం కూడా లేదు” అని ఆయన వాపోయారు. 

‘‘రోడ్డును బాగు చేసుకోవడం కోసం మేం ఇప్పటికే రూ. 1-2 లక్షలు ఖర్చు చేశాం. కానీ, అది సరిపోదు. మట్టిరోడ్డును తారు రోడ్డుగా మార్చాలంటే రూ .50 లక్షల నుండి కోటి రూపాయలు కావాలి. ఈ మొత్తాన్ని మంజూరు చేయాలని మేము ప్రభుత్వాన్ని,  స్థానిక ఎమ్మెల్యేను అభ్యర్థించాం ”అని మాయకొండ పంచాయితీ అభివృద్ధి అధికారి ఎంఆర్ సిద్దప్ప అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios