కర్నాటకలో చెలరేగిన హిజబ్ వివాదం సద్దుమణుగుతుందా? నేటినుంచి పలు జిల్లాల్లో స్కూళ్లు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలో గొడవలు ముగుస్తాయా? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి అనేది ఉత్కంఠగా మారింది.
బెంగళూరు : పది రోజులుగా hijab, కేసరి వివాదంతో పలు జిల్లాల్లో బుధవారం నుంచి మూతపడిన schoolలు సోమవారం ప్రారంభం అవుతుండగా గొడవలు తలెత్తకుండా ప్రభుత్వం భారీ బందోబస్తును కల్పిస్తోంది. ముందు జాగ్రత్తగా బెంగళూరు, మైసూరు, ఉడుపిలతో పాటు పలు జిల్లాల్లో భద్రతను పెంచాలని నిర్ణయించింది. సీఎం
Basavaraj Bommai జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు.
తొలి విడతలో 1 నుంచి 10వ తరగతి వరకు స్కూళ్లు మొదలవుతాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో section 144 జారీ చేశారు. 12 నుంచి 19వ తేదీ వరకు నిషేధాజ్ఞలు అమలవుతాయి. బడుల వద్ద గుంపులుగా ఉండరాదని, ధర్నాలు చేయరాదని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఏం జరుగుతుందన్నది ఉత్కంఠగా మారింది. హిజబ్ లు, కేసరి కండువాలను వేసుకుని వస్తే అధికారులు ఎలా వ్యవహరిస్తారో.. కాగా పాఠశాల పరిస్థితిని గమనించిన తర్వాత collegeలో ఆరంభంపై నిర్ణయానికి వస్తామని సీఎం చెప్పారు.
ఇదిలా ఉంటే.. దీనిమీద అనేక మంది రాజకీయనాయకులు, సెలబ్రిటీలు, ఉద్యమకారులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే Karnataka hijab row మీద ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి Yogi Adityanath స్పందించారు. భారతదేశం Constitution ప్రకారం నడుస్తుందని, Shariat చట్టం ప్రకారం కాదని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. హిజాబ్ వివాదంపై ఆదిత్యనాథ్ తొలిసారిగా ఓ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి సంస్థకు తమ సొంత Dress codeను రూపొందించుకునే హక్కు ఉందని, అయితే రాజ్యాంగం ప్రకారమే వ్యవస్థ నడపాలని అన్నారు.
“దేశ వ్యవస్థ షరియత్ తో కాకుండా రాజ్యాంగం ద్వారా నడుస్తుంది, క్రమశిక్షణకు డ్రెస్ కోడ్ ఉంది, ప్రతి సంస్థకు దాని స్వంత దుస్తుల కోడ్‌ను రూపొందించుకునే హక్కు ఉంది, అయితే అది భారత రాజ్యాంగం ప్రకారం జరిగేలా చూడాలి. ఇది ప్రతి ఒక్కరికీ ఆసక్తిని కలిగిస్తుంది”అని ఆయన అన్నారు.
అంతకుముందు శుక్రవారం, కర్ణాటక హైకోర్టు, హిజాబ్ వివాదానికి సంబంధించిన అన్ని పిటిషన్ల పరిశీలన పెండింగ్‌లో ఉన్నాయని, విద్యా సంస్థలను తిరిగి తెరవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది. విద్యార్థులందరూ తరగతి గది లోపల కాషాయ కండువాలు, హిజాబ్ లాంటి మతపరమైన దుస్తులు ధరించకుండా నిషేధించింది.
ఫిబ్రవరి 14 నుండి హైస్కూల్ లు, ఆ తరువాత ప్రీ-యూనివర్శిటీ, డిగ్రీ కళాశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో శాంతిభద్రతలను పరిరక్షించడం, హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించవద్దని దీనికోసం కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా యంత్రాంగాలకు వరుస ఆదేశాలు జారీ చేసింది.
సీఎం బసవరాజ్ బొమ్మై కొంతమంది మంత్రులు, డిప్యూటీ కమిషనర్లు (డీసీలు), పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీలు), పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ డిప్యూటీ డైరెక్టర్ (డీడీపీఐలు), అన్ని జిల్లాల జిల్లా పంచాయతీల సీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ground situationని సమీక్షించారు.
ఉన్నత విద్యా శాఖకు చెందిన విశ్వవిద్యాలయాలు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కాలేజియేట్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (DCTE) పరిధిలోని కళాశాలలకు ప్రకటించిన సెలవులు ఫిబ్రవరి 16 వరకు పొడిగించబడ్డాయి.
