Prime Minister Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముద్రా యోజన లబ్ధిదారులతో ముచ్చటించారు. ఈ సమయంలో ఒకరు తాను ఇంటర్మీడియట్ వరకు చదివాననీ, ఇప్పుడు టైలర్ గా ఉపాధి పొందుతున్నానని చెప్పారు.
Prime Minister Modi Karnataka visit: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్నాటక పర్యటన కొనసాగుతున్నది. ఈ క్రమంలోనే సోమవారం మైసూరు పర్యటన సందర్భంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ఆయన ముచ్చటించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి ముద్రా యోజన మరియు ఆయుష్మాన్ భారత్ యోజన వంటి వివిధ పథకాల లబ్ధిదారులతో ప్రధాని మోడీ సంభాషించారు. మైసూరులో నాగనహళ్లి రైల్వే స్టేషన్‌లో కోచింగ్ టెర్మినల్‌కు శంకుస్థాపన చేసి, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ డిజార్డర్స్‌కు సంబంధించిన 'సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్'ని జాతికి అంకితం చేశారు. అనంతరం ప్రధాని మోడీ ప్రభుత్వ లబ్దిదారులతో ముచ్చటించారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిపై నవ్వుతూ జోకులు పేల్చారు.
ప్రధాన మంత్రి ముద్రా యోజన లబ్ధిదారుల్లో ఒకరితో తన ఇంటరాక్షన్ సమయంలో, ఒక లబ్ధిదారు తాను టైలర్ ఉద్యోగం చేస్తున్నాననీ, ఇంటర్మీడియట్ వరకు చదివానని చెప్పారు. తన సొంత గ్రామంలోనే టైలరింగ్ నేర్చుకున్నానని చెప్పింది. ఈ క్రమంలో ప్రధాని మోడీ-లబ్దిదారుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. తన కోసం..ఇప్పుడు వేసుకున్నట్టు వంటి కుర్తాను మీరు కుట్టగలరా? అని ప్రధాని మోడీ అడగ్గా.. దానికి ఆమె సానుకూలంగా స్పందించింది. "ప్రహ్లాద్ జీ కోసం కూడా ఒకటి కుట్టండి" అని ప్రధాని మోడీ నవ్వుతూ తన పక్కనే కూర్చున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని చూపిస్తూ అన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులతో సంభాషించిన ప్రధాని మోడీ, ఇంటికి విద్యుత్, మరుగుదొడ్డి వంటి ప్రాథమిక సౌకర్యాలు ఉన్నాయా? అని అడిగారు. ఆయా సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు.
జల్ జీవన్ మిషన్ లబ్దిదారుడు ప్రధాని మోడీతో తాము స్వచ్ఛమైన తాగునీరు అందుకుంటున్నామనీ, గ్రామస్థులు ప్రతిరోజూ నీటిని అందుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. లబ్ధిదారులు గ్రామస్తులతో మమేకమై ప్రభుత్వ పథకాల గురించి తెలియని వారికి తెలియజేయాలని ప్రధాని మోడీ కోరారు. ఇలాంటి పథకాలపై అవగాహన లేని ఇతర గ్రామస్తులకు తెలియజేయాలని మీ అందరినీ కోరుతున్నాననీ, మరింత మంది పేదలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ప్రధాని మోదీ ఇక్కడ ''centre of excellence for persons with communication disorders''ని దేశానికి అంకితం చేస్తూ.. 'దివ్యాంగుల' సాధికారత కోసం అనేక అంశాల అభివృద్ధి చేయడానికి తమ ఆలోచనలను మరియు వినూత్న ఆలోచనలను ఉపయోగించాలని స్టార్టప్‌లను చేపట్టే యువతను కోరారు. ఈ సెంటర్ ప్రారంభం అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. "స్టార్టప్ ప్రపంచంలోని యువతను నేను కోరుతున్నాను.. దయచేసి వినూత్న ఆలోచనలతో కొత్త ఆలోచనలను రూపొందించండి. మీరు కొత్తగా ఏమి చేస్తున్నా, మీ స్టార్టప్ 'దివ్యాంగుల' కోసం చాలా పనులు చేయగలదు. ఇది ఇవ్వగల అనేక విషయాలను అభివృద్ధి చేయగలదు. వికలాంగులకు బలం మరియు సామర్థ్యంగా పనిచేస్తుంది. స్టార్టప్ ప్రపంచంలోని యువత వారికి సహాయం చేయడంలో నాకు సహకరిస్తారని నేను నమ్ముతున్నాను" అని ప్రధాని మోడీ అన్నారు. ఇదిలావుండగా, ఈ ఉదయం అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా మైసూర్ ప్యాలెస్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ, యోగా జీవితంలో ఒక భాగం కాదనీ, ఇది జీవిత మార్గంగా మారిందన్నారు.
