Asianet News TeluguAsianet News Telugu

12కిలోమీటర్లు వెంబడించి.. నేరస్థుడిని పట్టుకున్న కుక్క

తన నేర చరిత్ర గురించి చంద్ర నాయక్‌కు తెలిసిపోయిందని, త్వరలో అతడు తనను పోలీసులకు పట్టిస్తాడని చేతన్ భయపడిపోయాడు. ఈ క్రమంలోనే అతడు చంద్రనాయక్‌కు తుపాకీతో కాల్చి చంపాడు.

Karnataka Police Sniffer Dog Runs 12 km To Track Down Murder Accused
Author
Hyderabad, First Published Jul 21, 2020, 12:03 PM IST

ఓ నేరస్థుడిని పట్టుకునేందుకు ఓ పోలీసు కుక్క చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దాదాపు 12కిలోమీటర్లు వెంబడించి మరీ ఆ కుక్క నేరస్థుడిని పట్టుకుంది. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జులై నెల మొదటి వారంలో చంద్రనాయక్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కాగా.. అతను చనిపోవడానికి ముందు చేతన్ అనే వ్యక్తి నుంచి రూ.1.7లక్షలు అప్పు తీసుకున్నాడు.  ఈ విషయంలో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది.

అయితే తన నేర చరిత్ర గురించి చంద్ర నాయక్‌కు తెలిసిపోయిందని, త్వరలో అతడు తనను పోలీసులకు పట్టిస్తాడని చేతన్ భయపడిపోయాడు. ఈ క్రమంలోనే అతడు చంద్రనాయక్‌కు తుపాకీతో కాల్చి చంపాడు.

ఈ హత్యకు వినియోగించిన తుపాకీ గతంలో పోలీస్ స్టేషన్‌ నుంచి దొంగిలించినది. మరోవైపు.. ఈ దారుణం జరిగిన వారంపైనే అవుతున్నా చేతన్ ఎక్కుడున్నాడో పోలీసులు తెలుసుకోలేక పోయారు. అడుగు మందుకు పడట్లేదు. ఈ తరుణంలోనే వారు తమకు నమ్మినబంటైన తుంగాను రంగంలోకి దింపారు. తుంగా..పదేళ్ల వయసున్న పోలసు జాగిలం. ఇప్పటి వరకూ 50 మర్డర్ కేసులు, 60 దొంగతనాల కేసులను ఛేదించిన అనుభవశాలి.
దీంతో పోలీసులు..తుంగను చేతన్ చివరిసారిగా తిరుగాడిన ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి తుంగ మరో 12 కీమీల మేర వాసనను అనుసరిస్తూ వెళ్లి ఓ ఇంటి వ్దద ఆగింది. ఇంట్లోని వారు తమకేమీ తెలీదంటూ తొలుత బుకాయించినప్పటికీ..ఇంట్లోనే దాక్కున చేతన్.. పోలీసుల దృష్టి నుంచి తప్పించుకోలేకపోయాడు. వెంటనే వారు అతడిని స్టేషన్‌కు తరలించారు. అక్కడ పోలీసులు చేతన్‌ను తమదైన శైలిలో ప్రశ్నించగా తుపాకీని తానే దొంగతనం చేశానని, చంద్ర నాయక్‌ను హత్య చేశానని ఒప్పుకున్నాడు.  

Follow Us:
Download App:
  • android
  • ios