టీవీ సీరియల్ చూసి కిడ్నాప్ చేశాడు.. కానీ..
బసవనగుడికి బుల్ టెంపుల్ రోడ్డు కి చెందిన ఆర్.మెహతా(21) ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. అతనికి ఓ హిందీ ఛానెల్ లో ప్రసారమయ్యే ఓ సీరియల్ చూసే అలవాటు ఉంది. దాంట్లో చూసిన ఓ క్రైమ్ సీన్ ని రియల్ టైమ్ లో యాజిటీజ్ గా అప్లై చేశాడు.
సులభంగా డబ్బు సంపాదించాలని ఓ యువకుడు భావించాడు. అందుకోసం ఓ టీవీ సీరియల్ లోని సీన్ చూసి ఫాలో అయ్యాడు. బాలికను కిడ్నాప్ చేసి.. ఆమె తండ్రిని డబ్బులు డిమాండ్ చేద్దామనుకున్నాడు. కానీ చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... బసవనగుడికి బుల్ టెంపుల్ రోడ్డు కి చెందిన ఆర్.మెహతా(21) ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. అతనికి ఓ హిందీ ఛానెల్ లో ప్రసారమయ్యే ఓ సీరియల్ చూసే అలవాటు ఉంది. దాంట్లో చూసిన ఓ క్రైమ్ సీన్ ని రియల్ టైమ్ లో యాజిటీజ్ గా అప్లై చేశాడు.
Also Read యువకుడితో కోడలి అక్రమ సంబంధం: ఇద్దరి ముక్కులు కోసేసిన మావయ్య...
స్కూల్ నుంచి వస్తున్న ఓ నాలుగో తరగతి విద్యార్థిని ని కిడ్నాప్ చేశాడు. బాలిక ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన తండ్రి హీరాలాల్ తక్షణం పోలీసులకు సమాచారం అందించాడు. కాటన్‌పేటే సీఐ టీసీ.వెంకటేశ్ ల్యావెల్లీ రోడ్డు వద్ద వెళుతున్న చిరాగ్ మెహతాను పట్టుకుని బాలికను కాపాడారు.
బాలిక తండ్రి హీరాలాల్,..కాటన్‌పేటె మెయిన్‌రోడ్డులో నివాసముంటూ చిక్కపేటేలో ఎలక్ట్రిక్ దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడి వద్ద డబ్బు గుంజాలని దుండగుడు ఈ పథకం వేశాడు. చిరాగ్ మెహతా తండ్రి రాకేశ్ పెండ్లిపత్రికల దుకాణం నిర్వహిస్తుండేవాడు. టీవీ సీరియల్లో చూసి బాలికను కిడ్నాప్ చేసినట్లు నిందితుడు విచారణలో చెప్పాడు. కేసు విచారణలో ఉంది.