Karnataka: కాషాయ జెండా భవిష్యత్తులో ఎప్పుడైనా భారతదేశ జాతీయ జెండాగా మారే అవకాశం ఉందని బీజేపీ అగ్ర నేత, కర్నాటక మంత్రి రాజ్ కేఎస్ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం శ్రీరామచంద్రుడు, హనుమంతుడి రథాలపై కాషాయ జెండాయే రెపరెపలాడేదని గుర్తు చేశారు. అప్పుడు ఈ దేశంలో త్రివర్ణ పతాకం ఉన్నదా? అంటూ ప్రశ్నించారు.
Karnataka: ఇటీవలి కాలంలో బీజేపీ నేతలు పలు వివాదాలకు దారి తీసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏకంగా జాతీయ జెండా అంశం పై బీజేపీ అగ్రనేత, రాష్ట్ర మత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాషాయ జెండా భవిష్యత్తులో ఎప్పుడైనా భారతదేశ జాతీయ జెండాగా మారే అవకాశం ఉందని బీజేపీ అగ్ర నేత, కర్నాటక మంత్రి రాజ్ కేఎస్ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం శ్రీరామచంద్రుడు, హనుమంతుడి రథాలపై కాషాయ జెండాయే రెపరెపలాడేదని గుర్తు చేశారు. అప్పుడు ఈ దేశంలో త్రివర్ణ పతాకం ఉన్నదా? అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం హిజాబ్, కాషాయ కండువాల రగడకు కారణమైన కర్నాటక రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి ఇలా వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి.
బుధవారం నాడు కర్నాటక బీజేపీ అగ్రనేత, మంత్రి కే.ఎస్. ఈశ్వరప్ప మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ జెండా స్థానంలో కాషాయ జెండా వస్తుందని పేర్కొన్నారు. కాషాయ జెండా రాబోయే రోజుల్లో జాతీయ జెండాగా మారే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. దీనికి చాలా సమయం పడుతుందని పేర్కొన్నారు. ఒకప్పుడు తాము అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని చెబుతుంటే.. అందరూ నవ్వే వారని పేర్కొంటూ.. ఇప్పుడు మేం ఆయోధ్యలో రామాలయం నిర్మిస్తున్నాం కదా? అని వివరించారు. ఇదే విధంగా రాబోయే 100 సంవత్సరాలకో, 200 సంవత్సరాలకో, 500 సంవత్సరాలకో కచ్చితంగా కాషాయ జెండా జాతీయ జెండాగా మారుతుందని తెలిపారు. మీడియా ప్రతినిధులు ఎర్రకోటపై కాషాయ జెండా ఎగురుతుందా? అని ప్రశ్నించగా… ఇప్పుడు కాదు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఎగిరే అవకాశాలు మాత్రం ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలోనే ఆయన ఇతిహాసాల చరిత్రలను సైతం ప్రస్తావించారు. వందల సంవత్సరాల క్రితం శ్రీరామచంద్రుడు, మారుతీ రథాలపై కాషాయ జెండాలు ఉండేవి.. అప్పుడు మన దేశంలో త్రివర్ణ పతాకం ఉండేదా.. ఇప్పుడు దాన్ని (త్రివర్ణ పతాకం) మన జాతీయ జెండాగా నిర్ణయించామని అన్నారు. ప్రస్తుతం ఉన్న త్రివర్ణ పతాకమే మన జాతీయ జెండా అనీ, దానిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని తెలిపారు. అలాగే, “ఈరోజు దేశంలో హిందూ, హిందుత్వంపై చర్చలు జరుగుతున్నాయి . అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తామని చెప్పినప్పుడు ప్రజలు ఒకప్పుడు నవ్వుకునేవారు, ఇప్పుడు మనం నిర్మించడం లేదా? భవిష్యత్తులో, 100 లేదా 200 లేదా 500 సంవత్సరాల తర్వాత, భగవా ధ్వజం జాతీయ జెండాగా మారవచ్చు ”అని మంత్రి ఈశ్వరప్ప అన్నారు.
"...మేము కాషాయ జెండాను ఎగురవేసే వాళ్ళం, ఈరోజు కాదు భవిష్యత్తులో కొంత కాలం హిందూ ధర్మం ఈ దేశంలోకి వస్తుంది ఆ సమయంలో ఎర్రకోటపై ఆతిథ్యం ఇస్తాం, ప్రస్తుతానికి త్రివర్ణ పతాకం మన జాతీయ జెండా, అక్కడ దానిలో ఎటువంటి సందేహం లేదు మరియు మనమందరం దానిని గౌరవిస్తాము ”అని పేర్కొన్నారు.
శివమొగ్గలో..
ఇదిలావుండగా, మంగళవారం హిజాబ్ వ్యతిరేక నిరసన సందర్భంగా శివమొగ్గలోని ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కాలేజీలో విద్యార్థులు కాషాయ జెండాను వేగురవేశారు. త్రివర్ణ పతాక స్థానంలో కాషాయ జెండాను ఎగురవేయడం వివాదస్పదమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు మరింత వివాదానికి తెరదీసే అవకాశమూ లేకపోలేదు.
