ర్ణాటక మంత్రి డికె శివకుమార్‌ను బుధవారం నాడు మధ్యాహ్నం ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రెబెల్ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌ ముందే డికె శివకుమార్  ధర్నాకు దిగారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఆయనను అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు.

కర్ణాటక రాష్ట్రానికి చెందిన అసంతృప్త ఎమ్మెల్యేలు ముంబైలోని రెనెస్సెన్స్ హోటల్‌లో బస చేస్తున్నారు.ఈ హోటల్‌లోకి వెళ్లేందుకు శివకుమార్ మంగళవారం నాడు ప్రయత్నించారు. శివకుమార్ వల్ల తమకు ప్రాణహని ఉందని  రెబెల్ ఎమ్మెల్యేలు ముంబై కమిషనర్ కు  లేఖ రాశారు. దీంతో ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.

తీంతో హోటల్ గేటు ముందే శివకుమార్ ధర్నాకు దిగారు. ఈ ధర్నాతో  పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.