మద్యం మత్త్తులో పాముని మెడలో చుట్టుకొని.. ఆ తర్వాత దానిని నోటితో కొరికి చంపేసిన వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. లాక్ డౌన్ తర్వాత ఇటీవల దేశంలో మద్యం దుకాణాలు తెరుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి మద్యం పీకల దాకా తాగి.. తనకు అడ్డం వచ్చిందని పామును చంపేశాడు.

కాగా..వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు.. ఇప్పుడు అరెస్ట్ చేశారు. కాగా కర్ణాటకలోని ముగబాగిలు తాలూకా ముష్టూరు గ్రామంలో కుమార్‌ అనే వ్యక్తి ఫుల్లుగా తాగి బైక్‌లో వెళ్తుండగా.. పాము కనిపించింది. తాగిన మైకంలో దాన్ని చేతుల్లోకి తీసుకున్న కుమార్.. పామును కొరికి చంపేశాడు. 

ఆ తరువాత మెడలో వేసుకున్నాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు.. కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే దాదాపు 40 రోజుల లాక్‌డౌన్ తరువాత మద్యం షాపులు తెరుచుకోవడంతో.. దేశవ్యాప్తంగా మందుబాబులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మద్యం ఇచ్చిన కిక్‌తో వింత వింత చేష్టలు చేస్తున్నారు.