పాపం తాను ప్రాణం కన్నా ఎక్కువగా పెంచుకున్న చిలక తప్పిపోవడంత అతను చాలా డీలా పడిపోయాడు. వెంటనే తన చిలకను పట్టించిన వారికి రూ.50 వేలు రివార్డు ఇస్తానంటూ ప్రకటించాడు.
చాలా మంది ఇంట్లో జంతువులను పెంచుకుంటారు. కొందరు కుక్కలు, పిల్లులను పెంచుకుంటే.. మరి కొందరు చిలకలను కూడా పెంచుకుంటారు. అయితే.. ఓ వ్యక్తి ఇలానే ఓ చిలకను పెంచుకున్నాడు. అయితే.. అది అనుకోకుండా తప్పిపోయింది. పాపం తాను ప్రాణం కన్నా ఎక్కువగా పెంచుకున్న చిలక తప్పిపోవడంత అతను చాలా డీలా పడిపోయాడు. వెంటనే తన చిలకను పట్టించిన వారికి రూ.50 వేలు రివార్డు ఇస్తానంటూ ప్రకటించాడు. అయితే.. నిజంగానే ఓ వ్యక్తి అతనికి తప్పిపోయిన చిలకను ఇచ్చాడు. ఆనందంలో రివార్డు కంటే మరో రూ.35వేలు ఎక్కువ మనీ ఇవ్వడం గమనార్హం.
ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఆఫ్రికన్ దేశానికి చెందిన ఓ చిలుకను పెంచుకున్నాడు. దాని పేరు రుస్తుమ్. అయితే.. ఆ చిలుక జులై 16వ తేదీన కనిపించకుండా పోయింది. కర్ణాటకలోని తుమకూరులోని తన ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల దూరం వెళ్లింది. అయితే.. ఆ చిలుక శ్రీనివాస్ అనే వ్యక్తికి మరుసటి రోజు దొరికింది. దీంతో అతను దానిని తన ఇంటికి తీసుకువెళ్లాడు. చిలుక దొరికినప్పుడు చాలా బలహీనంగా ఉందని శ్రీనివాస్ చెప్పాడు.
అయితే.. చిలక తప్పిపోవడంతో యజమాని చాలా డీలా పడిపోయాడు. చిలుక తెచ్చి ఇచ్చిన వారికి రూ.50వేలు రివార్డు ప్రకటించాడు. కాగా..చిలుక యజమానులు దాని కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న శ్రీనివాస్..శుక్రవారం దానిని యజమాని ఇంటికి వెళ్లి మరీ స్వయంగా ఇచ్చి వచ్చాడు.
తన చిలుకను తనకు ఇచ్చినందుకు ఆనందంతో పొంగిపోయిన యజమాని ఇస్తానని చెప్పిన ఫ్రైజ్ మనీ కంటే రూ.35వేలు అదననంగా అంటే రూ.85వేలు రివార్డుగా అందజేశాడు.
తన చిలుకకు శ్రీనివాస్.. బలమైన ఆహారం తినిపించి.. ఆరోగ్యంగా చూసుకున్నాడని అందుకే మరింత ఎక్కువ రివార్డు ఇచ్చినట్లు చిలక యజమాని అర్జున్ తెలపడం గమనార్హం. ఆ చిలుకను వారు రెండున్నర సంవత్సరాలుగా పెంచుతున్నారట. తప్పిపోయిన వెంటనే పోస్టర్లు వేసి అంటించామని చెప్పాడు. ఆ పోస్టురు చూసే శ్రీనివాస్ తమ చిలుకను తమకు ఇచ్చేశాడని యజమాని అర్జున్ చెప్పాడు.
