Asianet News TeluguAsianet News Telugu

కేరళ తీరంలో ఉగ్రకదలికలు.. నిఘా హెచ్చరికలతో కర్ణాటక అప్రమత్తం, హై అలర్ట్

కేర‌ళ తీర ప్రాంతంలో ఉగ్ర‌వాదుల కార్య‌క‌లాపాలు జరుగుతున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడంతో కర్ణాటక  ప్రభుత్వం అప్రమత్తమైంది. నిఘా వ‌ర్గాల హెచ్చరికలతో క‌ర్నాట‌క తీర ప్రాంతాల్లో హై అల‌ర్ట్ జారీ చేశామ‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మై బుధ‌వారం ప్రకటించారు. 

karnataka issues high alert in coastal areas over terrorist activities
Author
Bangalore, First Published Sep 1, 2021, 3:56 PM IST

కేర‌ళ తీర ప్రాంతంలో ఉగ్ర‌వాదుల కార్య‌క‌లాపాలు జరుగుతున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడంతో కర్ణాటక  ప్రభుత్వం అప్రమత్తమైంది. నిఘా వ‌ర్గాల హెచ్చరికలతో క‌ర్నాట‌క తీర ప్రాంతాల్లో హై అల‌ర్ట్ జారీ చేశామ‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మై బుధ‌వారం ప్రకటించారు. హుబ్లి విమానాశ్ర‌యంలో ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ నిఘా వ‌ర్గాల స‌మాచారంతో క‌ర్నాట‌క‌లోని కోస్తా ప్రాంతంతో పాటు స‌మీప అట‌వీ ప్రాంతాల్లో అనుమానాస్ప‌ద కార్య‌క‌లాపాల‌పై రాష్ట్ర అధికార యంత్రాంగం దృష్టి సారించింద‌ని చెప్పారు.

ఆయా ప్రాంతాల్లో దేశ వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు ఏమైనా జ‌రుగుతున్నాయా అనే కోణంలో ఎన్ఐఏతో క‌లిసి రాష్ట్ర ప్ర‌భుత్వం నిఘా పెంచింద‌ని ఈ విష‌యాల‌న్నింటినీ తాను బ‌హిరంగంగా చ‌ర్చించ‌లేన‌ని తెలిపారు. ఉగ్ర కార్య‌క‌లాపాలు జరుపుతున్న ఓ వ్య‌క్తిని ఎన్ఐఎ అరెస్ట్ చేసింద‌ని బొమ్మై చెప్పారు. తీర ప్రాంతాల్లో ప్ర‌భుత్వం హై అల‌ర్ట్ జారీ చేసింద‌ని సీఎం వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios