Karnataka hijab row: కర్నాటకలోని పలు విద్యాసంస్థల్లో రాజుకున్న హిజాబ్ (Hijab) వివాదం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా హిజాబ్ ధరించడాన్ని నిషేధించేలా చట్టం తేవాలని ఉన్నావ్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ సాక్షి మహరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Karnataka hijab row: కర్నాటకలోని పలు విద్యాసంస్థల్లో రాజుకున్న హిజాబ్ (Hijab) వివాదం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నది. కర్నాటక నుంచి హిజాబ్ వివాదం ఇతర రాష్ట్రాలకు పాకుతోంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, పుదుచ్చేరి సహా పలు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. కర్నాటకలో ఇప్పటికే పలు విద్యాసంస్థల వద్ద హిజాబ్ తీసివేయాలని యాజమాన్యాల నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే భజరంగ్ దళ్ కార్యకర్త శివమొగ్గలో హత్యకు గురికావడం రాష్ట్రంలో ఈ వివాదం మరింతగా ముదిరింది. అలాగే, హిజాబ్ వివాదం కారణంగా నిరసన తెలిపిన విద్యార్థులపై ఎప్ఐఆర్ (FIR) నమోదుకావడం సంచలనంగా మారింది.
హిజాబ్ పై వివాదం కొనసాగుతున్న తరుణంలో బీజేపీ నేతలు చేసే వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఈ క్రమంలోనే హిజాబ్ పై ఉన్నావోకు చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ సాక్షి మహరాజ్ (Sakshi Maharaj) బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు ఆయన మీడియాతో హిజాబ్ పై చెలరేగుతున్న వివాదంపై మాట్లాడుతూ దేశవ్యాప్తంగా హిజాబ్ ధరించడాన్ని నిషేధించేలా చట్టం తేవాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ వివాదం నేపథ్యంలో ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలు హిజాబ్ తో రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు.
“ప్రతిపక్షం హిజాబ్ అంశాన్ని ఎన్నికల్లోకి తీసుకొచ్చింది. ఈ నియమం (యూనిఫాం కోసం) కర్నాటకలో ఏర్పడింది. ప్రజలు దీనిని తీవ్ర అంశంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే, దేశవ్యాప్తంగా హిజాబ్ (ధరించడం) నిషేధించేలా చట్టం చేయాలని నేను భావిస్తున్నాను” అని బీజేపీ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు సాక్షి మహారాజ్ (Sakshi Maharaj)అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ ఈ వివాదాన్ని స్పాన్సర్ చేస్తున్నదని ఆరోపిస్తున్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛపై దాడిగా అభివర్ణిస్తున్నాయి. ఇదిలావుండగా, కర్నాటక హైకోర్టు హిజాబ్ వివాదంపై విచారణ జరుపుతోంది. శుక్రవారం నాడు మరోసారి హిజాబ్ అంశం విచారణకు రానుంది.
కాగా, కర్నాటకలోని ఉడిపి జిల్లాలోని ప్రభుత్వ బాలికల పీయూ కళాశాలలో కొంతమంది విద్యార్థులను హిజాబ్ ధరించి.. తరగతులకు హాజరు కాకుండా నిరోధించారని ఆరోపించడంతో జనవరిలో హిజాబ్ అంశం వివాదాస్పదం అయింది. కాషాయ కండువాలు ధరించిన కొందరు విద్యార్థులు కాలేజీలకు రావడంతో పాటు హిజాబ్ లను లేకుండా తరగతులకు హాజరుకావాలని పేర్కొనడంతో ఈ వివాదం రాజుకుంది. ఈ క్రమంలోనే అక్కడి విద్యాసంస్థలు హిజాబ్ లేకుండా తరగతులకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే కొందరు విద్యార్థులు హిజాబ్ ధరించి కళాశాలలోకి రావడానికి ప్రయత్నించగా.. అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులు స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించిన యూనిఫాం మాత్రమే ధరించాలని, ఇతర మతపరమైన ఆచారాలను కాలేజీల్లో అనుమతించబోమని ప్రీ-యూనివర్శిటీ ఎడ్యుకేషన్ బోర్డు సర్క్యులర్ విడుదల చేయడంతో వివాదం మరింత ఉద్రిక్తంగా మారింది. అప్పటి నుంచి ఇది మరింతగా ముదిరి కర్నాటక (Karnataka hijab row) నుంచి ఇతర రాష్ట్రాలకు సైతం పాకింది. దీనిపై ప్రస్తుతం కర్నాటక హైకోర్టు విచారణ జరుపుతోంది.
