సోదరుడి ఉద్యోగంపై సోదరికి హక్కుండదు.. కారుణ్య నియామకాలపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు..
సోదరుడి ఉద్యోగంపై సోదరికి ఎలాంటి హక్కులు ఉండవని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. కర్ణాటకలోని తుమకూరుకు చెందిన యువతి .. మరణించిన తన సోదరుడి ఉద్యోగాన్ని కారుణ్య నియామకం కింద తనకు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసింది. కానీ ఊహించిన షాక్ తగిలింది.

కారుణ్య నియామకాలపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. సోదరుడి ఉద్యోగంపై సోదరికి ఎలాంటి హక్కులు ఉండవని, సోదరీమణులు.. సోదరి కుటుంబంలో సభ్యులు కాదని కర్ణాటక హైకోర్టు వెల్లడించింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి మరణించిన తరువాత అతని సోదరి ఉద్యోగం కోసం క్లెయిమ్ చేసింది.
నిబంధనల ప్రకారం ప్రభుత్వోద్యోగి విధుల్లో ఉండగా మరణిస్తే అతని కుటుంబంలోని ఒకరికి భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ నిబంధనల ప్రకారం.. ఓ సోదరి తన సోదరుడు మరణించిన తర్వాత అతని సంస్థలో ఉద్యోగం కావాలని కోరింది. కానీ, ఆమె అభ్యర్థనను ఆ కంపెనీ నిరాకరించింది.
ఈ దీంతో ఆ సోదరి సెషన్స్ కోర్టుకు వెళ్లింది. కోర్టు ఆమె పిటిషన్‌ను తిరస్కరించింది. తర్వాత ఆమె కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్ పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ప్రసన్న బి వరాలే , జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్ లతో కూడిన ధర్మాసనం సోదరుడి కుటుంబంలో సోదరిని చేర్చలేమని తెలిపింది.
సోదరి కాకుండా.. సోదరుడి కుటుంబంలో సభ్యులను అర్హులని పేర్కొంది. సోదరుడు మరణించిన తర్వాత సోదరి ఉద్యోగం కోసం క్లెయిమ్ చేసింది. ఇందుకోసం కంపెనీల చట్టం 1956, కంపెనీల చట్టం 2013లను కోర్టు ఉదహరించింది. ఈ చట్టాల ప్రకారం సోదరికి ఉద్యోగం ఇవ్వడానికి కంపెనీ నిరాకరించింది.
అసలు కేసేంటీ..?
కర్ణాటకలోని తుమకారులో బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ (బెస్కామ్)లోని ఓ ఉద్యోగి విధుల్లో ఉండగా మరణించాడు. అతని సోదరి పల్లవి కారుణ్య ప్రాతిపదికన కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నించింది. కంపెనీ నిరాకరించడంతో ఆమె సెషన్స్ కోర్టుకు ఆశ్రయించింది. కానీ, ఆమె పిటిషన్ ను సింగిల్ జడ్జి తిరస్కరించారు.
దీంతో ఆమె సెషన్స్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. రూల్ మేకర్స్ ఇప్పటికే వ్యక్తులను కుటుంబ సభ్యులుగా వివిధ పదాలలో నిర్వచించిన నిర్వచనం (కుటుంబం)యొక్క ఆకృతులను కోర్టు విస్తరించదని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ పరిస్థితిలో కోర్టు కుటంబ నిర్వచనం నుండి ఒక అంశాన్ని జోడించదు లేదా తీసివేయదు. సోదరి ఇచ్చిన వాదనను అంగీకరించినా నిబంధనలను తిరగరాసినట్లే అవుతుందని, అందుకే వాదనను అంగీకరించలేమని ధర్మాసనం పేర్కొంది.
పల్లవి తన సోదరుడిపై ఆధారపడి ఉన్నారని, కుటుంబంలో సభ్యురాలు కావడంతో కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగం ఇప్పించాలని పల్లవి తరఫు న్యాయవాది వాదించారు. దీనికి విరుద్ధంగా.. ప్రభుత్వ ఉద్యోగాలలో కారుణ్య ప్రాతిపదికన ఉపాధి కల్పించడం సమానత్వ నియమానికి మినహాయింపు అని కంపెనీ వాదించింది. ఇందుకోసం ఇచ్చిన పథకాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉందనీ, నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తే.. సోదరుడు మరణించిన తర్వాత సోదరికి ఉద్యోగం పొందే అర్హత లేదని పేర్కొంది.
కంపెనీ వాదనను హైకోర్టు అంగీకరించింది. పల్లవి విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. డ్యూటీలో ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగి (మగ లేదా ఆడ) ఉద్యోగానికి బదులుగా.. కారుణ్య నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులు మాత్రమే ఉద్యోగం పొందగలరని చాలా కాలంగా చట్టం ఉందని, అది కూడా సదరు ఉద్యోగిపై ఆధారపడి ఉన్నప్పడే అర్హులు. నిబంధనల ప్రకారం.. సోదరీమణులు కుటుంబ సభ్యుల నిర్వచనంలో చేర్చబడలేదు. అందువల్ల వారు కారుణ్య ఉద్యోగానికి అర్హులు కాదు.