బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో  ఇవాళ్టి నుండి జనవరి 2వ తేదీ నుండి రాత్రి ఉదయం 10 గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు కర్ప్యూ ను విధించింది. ఇప్పటికే  మహారాష్ట్రలో కూడ రాత్రిపూట కర్ఫ్యూను విధించారు.కరోనా కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. 

నూతన సంవత్సర వేడుకలపై కూడ ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది. రాత్రిపూట కర్ఫ్యూ విధించే అవకాశం ఉందనే ప్రచారాన్ని మంగళవారం నాడు సీఎం యడియూరప్ప ఖండించిన విషయం తెలిసిందే.

బ్రిటన్ లో కరోనా కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. ఈ తరుణంలో  దేశంలోని అన్ని రాష్ట్రాలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకొంటున్నాయి.  ఈ క్రమంలోనే రాత్రిపూట కర్ఫ్యూ విధించారు.

మహారాష్ట్రలో జనవరి 5వ తేదీ వరకు  రాత్రిపూట కర్ఫ్యూ విధించింది ఉద్దవ్ ఠాక్రే సర్కార్.  బ్రిటన్ నుండి వచ్చే విమానాలపై ఈ నెలాఖరు వరకు ఇండియా నిషేధం విధించింది.