కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. కర్ణాటకలో గెలుపెవరిదనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. మే 10వ తేదీన కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరనున్న సంగతి తెలిసిందే. మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిదనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓపినియన్ పోల్‌ను ఏషియానెట్-సువర్ణ న్యూస్ మీకు అందించేందుకు సిద్దమైంది. ఏషియానెట్ సువర్ణ న్యూస్- జన్ కీ బాత్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ రౌండ్-1 అంచనాను ఈరోజు (ఏప్రిల్ 14) రాత్రి 8.45 గంటలకు వెల్లడించనున్నాం.
అయితే ఈ సర్వే కన్నడ నాట ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉందనేది తెలియజేయనుంది. ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మేము నిర్వహించిన సర్వేలు వెలువరించిన అంచనాలు దాదాపుగా నిజమయ్యాయి. జన్ కీ బాత్ విషయానికి వస్తే.. దేశంలో ఏ ఎన్నికలు జరిగినా చాలా మంది జన్ కీ బాత్ సర్వే కోసం ఎదురుచూస్తారు. ఏ ప్రభుత్వం వస్తుంది? జన్ కీ బాత్ అనేది ఖచ్చితమైన సంఖ్యల ద్వారా అంచనా వేయగలదు. జన్ కీ బాత్ ఇంతకుముందు 36 సర్వేలను నిర్వహించింది. అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలలో కచ్చితమైన లేదా దాదాపు కచ్చితమైన ఫలితాలు, పోకడలను అంచనా వేసింది. ఇక, 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో జన్ కీ బాత్ ఖచ్చితమైన ఫలితాలను అంచనా వేసింది.
2018 ఎన్నికల్లో బీజేపీ 102 నుంచి 108 సీట్లు, కాంగ్రెస్ 72-74, జేడీఎస్ 42-44, ఇతరులు 2-4 సీట్లు గెలుస్తారని జన్ కీ బాత్ అంచనా వేసింది. ఆ ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే.. బీజేపీ 104, కాంగ్రెస్ 81, జేడీఎస్ 37, ఇతరులు 2 సీట్లు సాధించారు. ఈ గణంకాలను పరిశీలిస్తే జన్ కీ బాత్ ఎంత దగ్గరగా కచ్చితత్వంతో అంచనాలను అందించగలదో అర్థమవుతుంది.
ఇప్పుడు కర్ణాటకలో నిర్వహించిన ఓపినియల్ పోల్ విషయానికి వస్తే.. 20,000 యాదృచ్ఛిక నమూనాలతో ఈ అభిప్రాయ సేకరణ చేపట్టడం జరిగింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 11 మధ్య ఈ సర్వే నిర్వహించబడింది. క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. ప్రతి ప్రాంతాన్ని కవర్ చేస్తూ సాగిన ఈ సర్వేలో.. ఓల్డ్ మైసూర్, బెంగళూరు, సెంట్రల్ కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక, ముంబై కర్ణాటక, కోస్టల్ కర్ణాటక రిజీయన్‌ల వారిగా కూడా అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది.
ఓల్డ్ మైసూర్ రీజియన్‌లోని తుమకూర్, చిక్కబళ్లాపుర, కోలార్, రామనగర, మాండ్య, మైసూర్, చామరాజనగర, కొడగు, హసన్, బెంగళూరు రీజియన్‌లోని బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, సెంట్రల్ కర్ణాటక రీజియన్‌లోని చిత్రదుర్గ, దావణగెరె, చిక్కమగళూరు, శివమొగ్గ, హైదరాబాద్ కర్ణాటక రీజియన్‌లోని బీదర్, గుల్బర్గా, రాయచూర్, యాదగిర్, బళ్లారి, విజయనగర్, కొప్పల్, ముంబై కర్ణాటక రీజియన్‌లోని విజయపుర, బాగల్‌కోట్, బెలగావి, ధార్వాడ్, హావేరి, గడగ్, కోస్టల్ కర్ణాటక రీజియన్ లోని ఉత్తర కన్నడ, ఉడిపి, దక్షిణ కన్నడ యూనిట్‌ల వారీగా అభిప్రాయ సేకరణ జరిగింది. ఇక, సర్వే చేసినప్పుడు చాలా వరకు పార్టీల అభ్యర్థులను ప్రకటన జరగలేదు. పార్టీ అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత రౌండ్-2 అభిప్రాయ సేకరణ జరగనుంది.
పూర్తిగా క్షేత్రస్థాయిలో చేపట్టిన ఓపినియన్ పోల్స్ ద్వారా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్ల మూడ్‌ను తెలియజేయనున్నాం. అలాగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి అంచనాలను అందజేయనున్నాం. ఈరోజు (ఏప్రిల్ 14) రాత్రి 8.45 గంటలకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏషియానెట్ సువర్ణ న్యూస్- జన్ కీ బాత్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ రౌండ్-1 అంచనాను విడుదల చేయనున్నాం.
