బెంగుళూరు:కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దీంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. లాక్ డౌన్ కారణంగా చాలా మంది తమ ఇళ్లలో జరగాల్సిన శుభకార్యాలనను వాయిదా వేసుకొన్నారు. కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో పరిమితమైన అతిథుల సమక్షంలో ఫంక్షన్లు జరుపుకొన్నారు. లాక్ డౌన్ తో ఓ మహిళా డిఎస్పీ తన పెళ్లిని వాయిదా వేసుకొంది.ఈ  ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది.

also read:న్యూఢిల్లీ లేడి హర్డింగ్ ఆసుపత్రిలో పనిచేసే 8 మందికి కరోనా

కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలోని మలవళ్లి డిఎస్పీగా  ఎం.జె. పృథ్వీ పనిచేస్తున్నారు. థ్యామప్ప అనే యువకుడితో ఈ నెల 5వ తేదీన ఆమె వివాహం జరగాల్సి ఉంది. ఈ పెళ్లిని ధార్వాడలో జరిపేందుకు రెండు కుటుంబాలు ఏర్పాట్లు చేసుకొన్నాయి. ఏప్రిల్ 10వ తేదీన పెళ్లి రిసెప్షన్ ఘనంగా చేసుకోవాలని ఏర్పాట్లు చేసుకొన్నారు. మరో వైపు ఈ పెళ్లి కోసం ఆమె ఈ ఏడాది మార్చి చివర్లో  సెలవు కోసం దరఖాస్తు చేసుకొంది. 

అయితే పెళ్లికి రెండు కుటుంబాలకు చెందిన బంధువులు, కుటుంబసభ్యులు, స్నేహితులు రానున్నారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. అంతేకాదు సామాజిక దూరం పాటించాలని ప్రజలను కోరుతున్నాయి. 

మాండ్యా, మైసూరు జిల్లాల్లో కరోనా కేసులు పెరిగిపోయాయి. దీంతో ఆమె తన పెళ్లిని వాయిదా వేసుకోవాలని నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు .ఆమె తన సెలవును కూడ క్యాన్సిల్ చేసుకొన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం రెడ్ జోన్ గా ప్రకటించింది.పెళ్లిని వాయిదా వేసుకొని కరోనా విధులు నిర్వహిస్తున్న పృథ్వీని ఎంపీ సుమలత కూడ అభినందించారు.