కర్ణాటక రాజకీయ సంక్షోభం పూటకో మలుపు తిరుగుతోంది. రెబల్ ఎమ్మెల్యేల్లో ముగ్గురికి తనను కలిసేందుకు అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తనను కలవాల్సిందిగా రమేశ్ కుమార్ ఎమ్మెల్యేలకు సమాచారం అందించారు. మరో వైపు ఇవాళ్టీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాలకు సభ్యులందరూ హాజరు కావాలని కాంగ్రెస్, జేడీఎస్ తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశాయి.

కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు రమేశ్ జార్ఖిహోళి, మహేశ్ కుమటహళ్లి, జేడీఎస్‌కు చెందిన గోపాలయ్య, హెచ్ విశ్వనాథ్, నారాయణ గౌడ్‌లపై స్పీకర్ రెండు పార్టీల నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై సురేశ్ కుమార్ ఇవాళ నిర్ణయం ప్రకటించనున్నారు.