కర్ణాటకలో కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల భవితవ్యం కాసేపట్లో తేలిపోనుంది. ముంబైలో బస చేసిన రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ రమేశ్ కుమార్‌తో భేటీ కానున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేల భేటీని వీడియో రికార్డింగ్ చేస్తున్నారు.

ముంబై నుంచి రెండు ప్రత్యేక విమానంలో బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రెబల్ ఎమ్మెల్యేలు కట్టుదిట్టమైన భద్రత మధ్య విధానసౌదకు చేరుకున్నారు.

మరోవైపు స్పీకర్ కార్యాలయానికి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో వారు దీనిపై నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు, అధికారుల తీరును నిరసిస్తూ వారు విధాన సౌద వద్ద ఆందోళనకు దిగారు.