బెంగుళూరు: కాంగ్రెస్  పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బుధవారం నాడు స్పీకర్ రమేష్‌ కుమార్ కు రాజీనామాలు సమర్పించారు.హోస్పేట ఎమ్మెల్యే ఎంటిబి నాగరాజు,  చిక్‌బళ్లాపూర్ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ కూడ రాజీనామా చేశారు.

ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడ మాజీ ముఖ్యమంత్రి  సిద్దరామయ్యకు విశ్వాసపాత్రులుగా  ముద్రపడింది. ఇప్పటివరకు రాజీనామా చేసిన ఎమ్మెల్యేల సంఖ్య 16కు చేరుకొంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు ఉన్నారు.

తమ ప్రభుత్వాన్ని కాపాడుకొనేందుకు కాంగ్రెస్, జేడీ(ఎస్) నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ బెంగుళూరులో మకాం వేశారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా వ్యూహారచన చేస్తున్నారు.