కర్ణాటక రాజకీయం రోజుకో ములుపు తిరుగుతోంది. గురువారం జరగాల్సిన బలపరీక్ష నేటికి వాయిదా పడింది. విశ్వాసపరీక్ష లేకుండానే సభ నేటికి వాయిదా పడటంతో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఆ పార్టీ నేతలందరూ గురువారం రాత్రి అసెంబ్లీలోనే నిద్రించడం గమనార్హం. అంతేకాదు.. ఉదయాన్నే నిద్రలేచి అక్కడే మార్నింగ్ వాక్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలందరికీ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు.

మరికాసేపట్లో సభ ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ నేతలు వ్యూహాలను అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విప్ అంశంపై సుప్రీం కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టు తలుపు తట్టేందుకు రెడీ అయ్యింది. ఈ విషయంపై కర్ణాటక కాంగ్రెస్ నేత సిద్ధారామయ్య తమ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారు. మరి ఈ రోజైనా విశ్వాసపరీక్ష సజావుగా సాగుతుందో  లేదో  చూడాలి.