అనూహ్య మలుపు తిరుగుతున్న కర్ణాటక సంక్షోభంలో ఉత్కంఠను కొనసాగిస్తూ.. అసెంబ్లీని రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. విశ్వాస పరీక్షను సైతం రేపటికి వాయిదా వేస్తున్నట్లు సురేశ్ కుమార్ తెలిపారు.

అయితే బలపరీక్షను ఇవాళే నిర్వహించాలన్న గవర్నర్ సూచనను స్పీకర్ పట్టించుకోలేదంటూ మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నిరసన వ్యక్తం చేశారు. బలపరీక్ష ఇప్పుడే నిర్వహించాలని.. లేదంటే రాత్రంతా విధానసభలో ఉండి నిరసన తెలుపుతానని యడ్డీ హెచ్చరించారు. తమ ఎమ్మెల్యేలు సైతం రాత్రికి సభలోనే నిద్రపోతారని ఆయన తెలిపారు.