కర్ణాటక సంక్షోభం గంట గంటకు మలుపులు తిరుగుతోంది. విశ్వాస పరీక్షను ఇప్పుడే నిర్వహించాలంటూ బీజేపీ శాసనసభ్యులు పోడియం వద్ద నినాదాలు చేయడంతో సభా కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది.

స్పీకర్ సురేశ్ కుమార్ ఎంతగా చెప్పి చూసినా ఫలితం లేకపోవడంతో సభను అరగంట పాటు వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కాగా తమ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారంటూ కాంగ్రెస్ ఆరోపించడం సభలో కలకలం రేపింది.

నిన్నటి వరకు మాతో టచ్‌లో ఉన్న ఎమ్మెల్యేలు కనిపించడం లేదని.. తమ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని మంత్రి శివకుమార్ స్పీకర్‌ను కోరారు. దీనిపై స్పందించిన స్పీకర్.. రేపటి లోగా ఎమ్మెల్యే కిడ్నాప్‌పై నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.

మరోవైపు విప్‌పై క్లారిటీ వచ్చే వరకు విశ్వాస పరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడుతూ.. తమ ఎమ్మెల్యేలను ఏనాడు గొర్రెల మందలాగా చూడలేదని, సొంత తమ్ముళ్లలాగే భావించానని ఉద్వేగంగా చెప్పారు. అయినప్పటికీ వారు రాజీనామా చేస్తున్నారంటే ఇదంతా ఆపరేషన్ కమల్‌లో భాగమేనంటున్నారు.