Asianet News TeluguAsianet News Telugu

Karnataka Covid Third Wave: కర్ణాటకలో కరోనా థర్డ్‌వేవ్.. వంద‌లాది విద్యార్దులకు పాజిటివ్..

కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌‌మగళూరులో(Chikmagalur)ఉన్న జవహర్ నవోదయ రెసిడెన్షియల్ పాఠశాలలో కరోనా కలకలం రేపుతోంది. ఏకంగా 101 మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
 

Karnataka Covid Third Wave Covid cases at residential school in Chikmagalur rise to 101
Author
Hyderabad, First Published Dec 7, 2021, 10:19 AM IST

Karnataka Covid Third Wave:  భార‌త్ లో మ‌ళ్లీ కరోనా వైర‌స్ విజృంభిస్తోంది. త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని అంద‌రూ కూల్ గా ఉన్న ఈ స‌మ‌యంలో చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. భయాందోళనకు గురి చేస్తోంది. మ‌ళ్లీ దేశం పానిక్ మోడ్ లోకి వెళ్లిపోయింది. దేశ ప్ర‌జానీకానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా కర్ణాట‌క‌లో క‌రోనా త‌న పంజా విరుసుతోంది. ఈ సారి ఏకంగా కర్ణాటకలోని ఓ పాఠశాలలో ఏకంగా వందమంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

కర్ణాటక చిక్కమంగళూరులోని జవహర్‌ నవోదయ పాఠశాలలోని రెసిడెన్షియల్ పాఠశాల (Chikmagalur residential school) లో కరోనా కలకలం పెడుతోంది. హాస్టల్‌లో 101 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనావైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆదివారం 69 మంది విద్యార్థులకు పాజిటివ్ అని నిర్థార‌ణ కాగా.. ఈ క్రమంలో సోమవారం మ‌రి కొంత మంది విద్యార్థుల‌ను ప‌రీక్షించ‌గా..  32 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మొత్తం 90 మంది విద్యార్థుల‌కు 11 మంది సిబ్బందికి వైర‌స్ సోకిన‌ట్టు వెల్ల‌డించి పాఠ‌శాల యాజ‌మాన్యం. 

Read Also: https://telugu.asianetnews.com/coronavirus-andhra-pradesh/covid-update-andhra-pradesh-reports-122-corona-cases-in-last-24-hours-r3p5zp 
 

దేశంలో ఒమిక్రాన్ కేసుల కూడా విస్త‌రించ‌డంలో అన్ని సాంపిల్స్ ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపటనున్నట్లు చిక్కమంగళూరు ఆరోగ్య అధికారి డాక్టర్‌ ఉమేష్ ప్ర‌క‌టించారు. అయితే.. ఇక్క‌డ క‌రోనా పాజివిట్ అని తేలిన విద్యార్థులు, సిబ్బందికి క‌రోనా లక్షణాలు ఏవీ కనిపించలేదని తెలిపారు. దీంతో 
నవోదయ పాఠశాలను వారం పాటు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.మిగితా  విద్యార్థులు, సిబ్బంది అందరినీ పాఠశాలలోనే ఐసోలేష‌న్ కు త‌ర‌లించిన‌ట్టు పేర్కొన్నారు. ఈ పాఠ‌శాలో మొత్తం 457 మంది విద్యార్థుల‌కు, సిబ్బందికి క‌రోనా టెస్టులు నిర్వ‌హించ‌మ‌నీ, వారిలో 101 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ వైద్యాకారులు తెలిపారు. ఓకే పాఠశాలలో వంద మందికి పైగా.. క‌రోనా సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్కూల్స్, కళాశాలల్లో బయటపడుతున్న కేసుల సంఖ్య కరోనా థర్డ్‌వేవ్(Corona Third Wave) భయాన్ని రేపుతోంది.

Read Also: https://telugu.asianetnews.com/coronavirus-telangana/35-students-test-positive-for-covid-19-in-chalmeda-medical-college-karimnagar-district-r3n94s

మ‌రోవైపు ప్ర‌పంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ భయాందోళనకు గురి చేస్తోంది. ద‌క్షిణాఫ్రికాలో బ‌య‌ట‌ప‌డ్డ ఈ కొత్త వేరియంట్ శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. ఇప్పటి వరకు 46 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్ ఇండియాలో కూడా వ్యాప్తి చెందింది. ఇప్ప‌టివ‌ర‌కూ ఇండియాలో 25 కేసులు న‌మోదయ్యాయి. అదే సమయంలో దేశంలో చాపకింద నీరులా కరోనా వైరస్ కేసులు విస్తరిస్తున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మయ్యాయి. ఈ క్ర‌మంలో కేంద్రం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేస్తోంది.ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 128.76 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. దేశంలో తొలి ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన బెంగళూరులోనే కరోనా థర్డ్‌వేవ్ ప్రకంపనలు కన్పిస్తున్నాయి. స్కూల్స్, కళాశాలల్లో బయటపడుతున్న కేసుల సంఖ్య కరోనా థర్డ్‌వేవ్(Corona Third Wave) భయాన్ని రేపుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios