Asianet News TeluguAsianet News Telugu

నూతన సంవత్సర వేడుకలపై కరోనా ఎఫెక్ట్.. రాత్రి ఒంటి గంట వరకే సెలబ్రేషన్స్ .. మాస్క్ లేకుంటే ఇక అంతే..  

మరోసారి కరోనా కేసులు భారీగా నమోదువుతున్న వేళ.. నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను సోమవారం జారీచేసింది. రెస్టారెంట్, పబ్బులు, సినిమా హాళ్లు, స్కూల్స్, కాలేజీల్లో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని స్పష్టం చేసింది. నూతన సంవత్సర వేడుకలను రాత్రి ఒంటి గంట వరకు మాత్రమే నిర్వహించుకోవాలని పేర్కొంది. 

Karnataka Covid Guidelines For New Year
Author
First Published Dec 26, 2022, 11:43 PM IST

ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి  కల్లోలం రేపుతోంది. చైనాతో సహా పలు ప్రపంచదేశాల్లో ఒమిక్రాన్ సబ్-వేరియంట్ బీఎఫ్.7 వేగవంతంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో మరోసారి కరోనా కేసులు భారీగా నమోదువుతున్నాయి. ఈ తరుణంలో కర్టాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను సోమవారం జారీచేసింది.

పబ్‌లు, రెస్టారెంట్లు, బార్లు, సినిమా థియేటర్లు, స్కూళ్లు, కాలేజీల్లో పలు ఆంక్షలు విధించింది. వాటిల్లో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని స్పష్టం చేసింది. అలాగే.. నూనత సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. రాత్రి 1 గంట వరకూ మాత్రమే.. సెలబ్రేషన్స్ చేసుకోవాలని పేర్కొంది. అయితే.. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, ముందుజాగ్రత్తలు పాటించాలని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. 
 
ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవాలి:  కర్ణాటక ఆరోగ్య మంత్రి 

వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణులు, చిన్నారులు రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని కర్ణాటక ఆరోగ్య మంత్రి కె సుధాకర్ సూచించారు.  టీకాల విషయంలో ప్రజలందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రద్దీగా ఉండే ప్రదేశాలు, మూసి ఉన్న ప్రదేశాలు, ఎయిర్ కండిషన్డ్ గదులు, బహిరంగ సమావేశాలలో మాస్క్‌లు తప్పనిసరి అని సుధాకర్ చెప్పారు. వేడుకలు జరిగే ప్రదేశాల్లో అనుమతి కంటే ఎక్కువ మంది ఉండకూడదని హెచ్చరించారు. స్కూల్స్‌లో పూర్తి స్థాయి వ్యాక్సినేషన్, శానిటైజర్, మాస్క్‌లు ధరించడం తప్పనిసరని పేర్కొన్నారు. బెంగళూరు, మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలలో అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.  బెంగుళూరులోని బౌరింగ్ హాస్పిటల్, మంగళూరులోని వెన్‌లాక్ హాస్పిటల్‌లను  పాజివిట్ వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికుల కోసం క్వారంటైన్ కేంద్రాలుగా మర్చినట్టు తెలిపారు. చైనా నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చిన ప్రయాణికుడి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ప్రయోగశాలకు పంపినట్లు మంత్రి తెలిపారు.

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడకుండా చర్యలు: కర్ణాటక ముఖ్యమంత్రి 

కరోనా మహమ్మారి కట్టడికి నివారణ, ముందుజాగ్రత్త చర్యలు సాధారణ ప్రజల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడకుండా దశలవారీగా తీసుకుంటామని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. సోమవారం నాడు సువర్ణ సౌధలో సీఎం విలేకర్లతో మాట్లాడుతూ..కరోనా మహమ్మారి వ్యాప్తిపై రాష్ట్ర మంత్రివర్గంతో తరుచుగా చర్చిస్తున్నామని తెలిపారు. వ్యాక్సినేషన్‌, బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించడం, దశలవారీగా ఇతర నివారణ చర్యలను అమలు వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సాంకేతిక సలహా కమిటీ సభ్యులు నిర్ణయించినట్లు సీఎం తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios