మరో పరువు హత్య వెలుగులోకి వచ్చింది. తమ కుమార్తె వేరే కులం వ్యక్తి వాడిని పెళ్లి చేసుకుందని ఆమె తల్లిదండ్రులు పగ పట్టారు. తమకు నచ్చని పెళ్లి చేసుకొని తమ పరువు తీసిందని వారు భావించారు. పగ పట్టి మరీ వాళ్ల కులస్థులతో కలిసి రాళ్లతో కొట్టి చంపేశారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కర్ణాటక రాష్ట్రం గదాగ్ జిల్లాకి చెందిన రమేష్... అదే ప్రాంతానికి చెందిన గంగమ్మ అనే యువతి ప్రేమించుకున్నారు. వీరిద్దరి కులాలు వేరు కావడంతో వీరి పెళ్లికి గంగమ్మ కుటుంబసభ్యులు అంగీకరించలేదు. దీంతో... వారికి ఇష్టం లేకుండానే రమేష్, గంగమ్మలు నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. అనంతరం తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు.

ఇద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నవారు వీరికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవల గంగమ్మ, రమేష్ లు తమ స్వగ్రామానికి వచ్చారు. కాగా... వారిని గ్రామంలో చూసిన యువతి కులస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దంపతులు ఇద్దరిపై యువతి కులస్థులు, కుటుంబసభ్యులు రాళ్లతో కొట్టి మరీ దారుణంగా  కొట్టారు. దీంతో తీవ్రగాయాలపాలై వారు అక్కడికక్కడే మృతి చెందారు.

దంపతులు ఇద్దరూ చనిపోగా... పిల్లలు ఇద్దరూ అనాథలయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతుంది. నిందితులను కచ్చితంగా శిక్షిస్తామని పోలసులు చెప్పారు.