Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో విషాదం.. మాజీ మంత్రి ఇనామ్‌దార్ కన్నుమూత..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో విషాదం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డీబీ ఇనామ్‌దార్ మంగళవారం కన్నుమూశారు. 

Karnataka Congress Leader DB Inamdar Passed away ksm
Author
First Published Apr 25, 2023, 10:14 AM IST

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో విషాదం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దానప్పగౌడ బసనగౌడ(డీబీ) ఇనామ్‌దార్ మంగళవారం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా ఊపిరితిత్తులు, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇనామ్‌దార్ మృతితో బెళగావి కాంగ్రెస్ దిగ్భ్రాంతికి గురైంది.

డీబీ ఇనామ్‌దార్.. కిత్తూరు నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.1983లో కిత్తూరు నియోజకవర్గం నుంచి జనతాపార్టీ నుంచి ఇనామ్‌దార్ తొలిసారి పోటీ చేసి గెలుపొందారు. 1994లో కాంగ్రెస్‌లో చేరిన ఇనామ్‌దార్ ఇప్పటి వరకు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఆయన రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. సిరసంగి దేశాయ్ ఫౌండేషన్ ట్రస్ట్ బోర్డులో పూర్తికాల సభ్యునిగా కొనసాగారు. 

అయితే ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో డీబీ ఇనామ్‌దార్‌కు కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించింది. కిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా బాబాసాహెబ్ పాటిల్ పేరును ప్రకటించింది. ఈ నిర్ణయాని ఇనామ్‌దార్ కుటుంబం, మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇనామ్‌దార్‌ మద్దతుదారులు ఆయన స్వగ్రామం నేగినాహల్‌లో నిరసన ప్రదర్శనలు కూడా నిర్వహించారు. ఇక, గత కొంతకాలంగా ఇనామ్‌దార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios