Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటక సీఎం యడియూరప్ప రాజీనామా: రెండేళ్ల వార్షికోత్సవ సభలో కంటతడి

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు బిఎస్ యడియూరప్ప చెప్పారు. తన రెండేళ్ల వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ విషయం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.

Karnataka CM Yediyurappa to resign: Breaks down at two years anniversary of his government
Author
Bengaluru, First Published Jul 26, 2021, 12:16 PM IST

బెంగుళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప రాజీనామా చేశారు. దీంతో ఆయన రెండేళ్ల పాలన ముగియనుంది. గత కొన్ని రోజులుగా ఆయన రాజీనామాపై ఊహాగానాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఆ ఊహాగానాలకు తెర దించుతూ ఆయన రాజీనామా చేయనున్నారు. సోమవారం సాయంత్రం ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించనున్నారు. 

ముఖ్యమంత్రిగా యడియూరప్ప రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. తన ప్రభుత్వం రెండేళ్ల వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన కంటతడి పెట్టారు. కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఉద్వేగాన్ని నిలువరించుకోలేకపోయారు.  తాను కర్ణాటక ముఖ్యమంత్రిగా తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. 

అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రివర్గంలో చేరాలని అడిగారని, అయితే తాను కర్ణాటక రాజకీయాల్లోనే ఉంటానని చెప్పానని ఆయన అన్నారు. కర్ణాటక శాసనసభలో ఆయన మాట్లాడారు. 

ఎళ్ల వేళలా తనకు అగ్నిపరీక్ష ఎదరువుతూనే ఉన్నదని, గత రెండేళ్ల పాటు కోవిడ్ ఇబ్బంది పెట్టిందని ఆయన అన్నారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన మాట్లాడారు. రెండేళ్ల పాటు ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపినట్లు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios