Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటక ఉద్యోగులకు యడియూరప్ప షాక్: 3నెలలు సెలవులు రద్దు

గత సంకీర్ణ ప్రభుత్వంలో పాలన సజావుగా సాగలేదని, రాష్ట్రంలో అనిశ్చితి నెలకొందని ఆరోపించారు. రాష్ట్రంలో పాలనను గాడిన పెట్టేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అధికారులు పాలనపై పూర్తిగా శ్రద్ధ పెట్టాలని సూచించారు. మరో మూడు నెలల వరకూ ఎవరూ సెలవులు పెట్టకూడదంటూ సీఎం ఆదేశాలు జారీ చేశారు.

karnataka cm yadiyurappa sensational comments on employees
Author
Bengaluru, First Published Aug 3, 2019, 4:28 PM IST

కర్ణాటక: కర్ణాటక ఉద్యోగులకు షాక్ ఇచ్చారు నూతన ముఖ్యమంత్రి యడియూరప్ప. మూడు నెలలపాటు ప్రభుత్వ ఉద్యోగులు సెలవులు పెట్టొద్దంటూ హెచ్చరించారు. మూడు నెలలపాటు శని, ఆదివారాల్లో కూడా ఉద్యోగులు పనిచేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 

గత సంకీర్ణ ప్రభుత్వంలో పాలన సజావుగా సాగలేదని, రాష్ట్రంలో అనిశ్చితి నెలకొందని ఆరోపించారు. రాష్ట్రంలో పాలనను గాడిన పెట్టేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.  

అధికారులు పాలనపై పూర్తిగా శ్రద్ధ పెట్టాలని సూచించారు. మరో మూడు నెలల వరకూ ఎవరూ సెలవులు పెట్టకూడదంటూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. శనివారం అన్ని డివిజన్ల కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో సీఎం యడియూరప్ప సమావేశం నిర్వహించారు.
 
కరువు నుంచి రాష్ట్రాన్ని బయట కాపాడేందుకు, పాలనను గాడిలో పెట్టేందుకు శని, ఆదివారాలు కూడా పనిచేయాలని ఆదేశించారు. మూడు నెలలు వరకు నో హాలిడేస్ అని స్పష్టం చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను గుర్తించి, ఎలాంటి ఆలస్యమూ లేకుండా వారికి వెంటనే పరిహారాన్ని చెల్లించాలని అధికారులను ఆదేశించారు.

రైతులు పశుగ్రాసాన్ని టన్నుకు 4,000 చెల్లించి కొనుగోలు చేస్తున్నారని, పశుగ్రాసం పెంచేందుకు అధికారులు దృష్టి సారించాలని ఆయన కోరారు. ఇక, ఆల్మటి, నారాయణపూర్ డ్యాముతో పాటు మరో 10 బేరజ్‌లలో నీటి మట్టాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని యడియూరప్ప అధికారులను ఆదేశించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios